Market High: బీజేపీ పార్టీ అధిక రాష్ట్రాల ఎన్నికల్లో ఆధిక్యాన్ని నమోదు చేయటంతో మార్కెట్లు ర్యాలీలో ఉన్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ దాదాపు 1,100 పాయింట్లకు పైగా పెరగటంతో సరికొత్త రికార్డు గరిష్ఠాలకు బెంచ్ మార్క్ సూచీలు చేరుకున్నాయి. కేవలం 15 నిమిషాల్లో మార్కెట్లో పెట్టుబడిదారుల సంపద రూ.4 లక్షల కోట్ల మేర పెరిగింది.
తాజా ఎన్నికల్లో బీజేపీ హవా 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ నమోదవుతుందని మార్కెట్లు బలంగా విశ్వశిస్తున్నాయి. దీంతో వరుసగా మూడోసారి కేంద్రంలో మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందనే నమ్మకానికి ఇది ఆజ్యం పోసింది. ఈ విజయం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపింది. దీనికి తోడు ఇటీవల విడుదలైన Q2 GDP వృద్ధి సానుకూల సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. వాస్తవానికి రిజర్వు బ్యాంక్ అంచనాలను అధిగమించి 7.6 శాతంగా నమోదు కావటం జరిగింది.

తాజా ఎన్నికల ఫలితాల పరిణామాలతో సోమవారం నాడు బెంచ్‌మార్క్ సూచీ నిఫ్టీ కొత్త గరిష్ట స్థాయి 20,602.50కి చేరుకోగా.. మరో కీలక సూచీ సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా పెరిగి 68,587.82 రికార్డు స్థాయిని తాకింది. దీంతో డిసెంబర్ నెలను దేశీయ స్టాక్ మార్కెట్లు 2% కంటే ఎక్కువ పెరుగుదలను సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ అఖండ విజయాలు సాధించడంతోపాటు తెలంగాణను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం మార్కెట్‌కు ఊపునిచ్చింది. ఇదే సెషన్‌లో మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా తాజా రికార్డుల గరిష్టాలను తాకాయి.
మే 2024 లోక్‌సభ ఎన్నికలకు చివరి రిహార్సల్‌గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు దేశంలో బీజేపీ బలాన్ని విస్పష్టం చేశాయని రాజకీయ, మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో రాజకీయ స్థిరత్వం మార్కెట్లకు కీలకమైన అంశం కావటంతో తాజా విజయాన్ని ఇన్వెస్టర్లు ఆహ్వానించారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(FPI)లు కూడా మార్కెట్ పురోగమన పథంలో కీలక పాత్ర పోషించారు. రెండు నెలల బలమైన అవుట్‌ఫ్లోల తర్వాత, నవంబర్‌లో FPIలు నికర కొనుగోలుదారులుగా మారారు.


Click it and Unblock the Notifications