Stock Market: భారీ లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. ఆగని రికార్డుల ర్యాలీ..
Market Closing: ఏడాది చివర దగ్గర పడుతున్న కొద్ది దేశీయ స్టాక్ మార్కెట్లలో పరుగులు పుంజుకుంటున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు సాయంత్రానికి సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 372 పాయింట్ల లాభంలో ముగియగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 128 పాయింట్లు పెరిగింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 214 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 281 పాయింట్ల మేర లాభంతో ముగిసింది. ఈ క్రమంలో నేడు నిఫ్టీ సూచీ 21,801 పాయింట్ల గరిష్టాన్ని తాకగా.. సెన్సెక్స్ 72,484 పాయింట్ల రికార్డును తాకింది.

NSEలో కోల్ ఇండియా, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటార్స్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, టాటా కన్జూమర్, నెస్లే, టాటా మోటార్స్, సిప్లా, పవర్ గ్రిడ్, ఎయిర్ టెల్, ఐటీసీ, దివీస్ ల్యాబ్, హిందాల్కొ, యూపీఎల్, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, ఎల్ టి, ఎల్ టిఐమ్, అదానీ పోర్ట్స్, విప్రో, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications