Stock Market: భారీ లాభాల్లో Nifty, Sensex.. నష్టాల్లో వేదాంత స్టాక్..
Stock Market: ఉదయం మంచి లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా వేదాంత స్టాక్ నష్టాలను నమోదు చేస్తోంది.
ఉదయం 9.40 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 324 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 100 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 113 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 208 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.

మార్కెట్‌లో కొనసాగుతున్న ర్యాలీ విస్తృత స్థాయి ర్యాలీ నుంచి నిర్దిష్ట స్టాక్ ఆధారిత ర్యాలీకి నెమ్మదిగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత స్థాయిల కంటే ర్యాలీని చాలా ఎక్కువగా తీసుకెళ్లగల ప్రధాన ట్రిగ్గర్‌లు ఏవీ లేవని, దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతున్నాయని వారు చెబుతున్నారు. రేపు విడుదల కానున్న TCS, HCL టెక్ Q1 FY24 ఫలితాలు నిరుత్సాహంగా ఉండనున్నట్లు వెల్లడైంది.
NSEలో బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఎల్ టి, సిప్లా, ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా ట్రేడవుతున్నాయి.
ఇదే క్రమంలో యూపీఎల్, హీరో మోటార్స్, ఎస్బీఐ, విప్రో, టాటా స్టీల్, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications