ముంబై: బడ్జెట్ సమావేశాలకు ముందు స్టాక్ మార్కెట్లు శనివారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.35 సమయానికి సెన్సెక్స్ 38 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.46 వద్ద ట్రేడ్ అవుతోంది. గత కొద్ది రోజులుగా బడ్జెట్ పైన ఇన్వెస్టర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ రోజు బడ్జెట్‌కు ప్రతిపాదనలకు అనుగుణంగా మార్కెట్లు పైకి కిందకు తచ్చాడుతూ.. భారీ మార్పులకు లోనయ్యే అవకాశముంది.
బడ్జెట్ ప్రసంగానికి కొద్ది నిమిషాల ముందు మాత్రం సెన్సెక్స్ లాభాల్లోకి వెళ్లింది. గం.10.57 సమయానికి సెన్సెక్స్ 125.85 (0.31%) పాయింట్ల లాభంతో 40,849.34 పాయింట్లతో ఉంది. కానీ నిఫ్టీ మాత్రం 37.65 (0.31%) నష్టంతో 11,998.15కి దిగజారింది. బడ్జెట్ ప్రసంగం సమయంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బడ్జెట్ ప్రసంగం సాగుతున్న కొద్దీ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం గం.1.30 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లకు పైగా పడిపోయి 40,018 వద్ద నిలిచింది. నిఫ్టీ 280 పాయింట్లకు పైగా దిగజారి 11,754 వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్లకు నిర్మలమ్మ బడ్జెట్ రుచించలేదు.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం గం.11కు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. దాదాపు గంటన్నరకు పైగా ఈ ప్రసంగం కొనసాగనుంది. సాధారణంగా శనివారం, ఆదివారం మార్కెట్లు ఉండవు. కానీ బడ్జెట్ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 1) మార్కెట్లు తెరుచుకున్నాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications