ఆల్ టైమ్ గరిష్టానికి మార్కెట్లు: సెన్సెక్స్ 650 పాయింట్లు జంప్, 42,500 క్రాస్
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం(నవంబర్ 9) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.09:20 సెన్సెక్స్ 519.08 పాయింట్లు(1.24%) పెరిగి 42,412.14 వద్ద, నిఫ్టీ 148.40 పాయింట్లు (1.21%) ఎగిసి 12,411.90 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ ఉదయం గం.10 లోపు 660 పాయింట్లు లాభపడింది.
1,115 షేర్లు లాభాల్లో, 282 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 51 షేర్లలో ఎలాంటి మార్పులేదు. అన్ని రంగాలు కూడా లాభాల్లో ఉన్నాయి. గత వారం సెన్సెక్స్ 2,278.99 పాయింట్లు లేదా 5.75 శాతం ఎగిసింది. ఇప్పుడు వారం ప్రారంభంలోనే రికార్డు స్థాయికి చేరుకుంది.

టాప్ గెయినర్స్.. లూజర్స్
ఉదయం గం.9.50 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో దివిస్ ల్యాబ్స్ 4.19 శాతం, ICICI బ్యాంకు 3.86 శాతం, బీపీసీఎల్ 3.21 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 3.00 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.65 శాతం ఎగిశాయి.
టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా 0.62 శాతం, అదానీ పోర్ట్స్ 0.31 శాతం, టీసీఎస్ 0.15 శాతం, సిప్లా 0.09 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, దివిస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, సిప్లా ఉన్నాయి.
HDFC బ్యాంకు ట్రాగెట్ ధరను మోతీలాల్ ఓస్వాల్ రూ.1370కు పెంచింది. ఎస్కార్ట్స్ టార్గెట్ ధరను రూ.1345కి పెంచింది.
గోల్డ్ మన్ శాక్స్ 150 బిలియన్ డాలర్లను బయోకాన్ బయోలాజికల్‌లో ఇన్వెస్ట్ చేయనుంది. బయోకాన్ స్టాక్ 0.98 శాతం ఎగిసింది.

ఐటీ స్టాక్స్ జంప్
నిఫ్టీ ఆటో 0.61 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.12 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.26 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.83 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.08 శాతం, నిఫ్టీ ఐటీ 1 శాతం, నిఫ్టీ మీడియా 0.72 శాతం, నిఫ్టీ మెటల్ 0.56 శాతం, నిఫ్టీ ఫార్మా 0.84 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.27 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.39 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 2.31 శాతం పెరిగాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ఉన్నాయి.
ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఐటీ, రియాల్టీ రంగాలు అదరగొట్టాయి.
ప్రారంభ సెషన్లో ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ స్వల్పంగా తగ్గింది. ఈ షేర్ 0.13 శాతం క్షీణించింది. HCL టెక్ 0.90 శాతం, ఇన్ఫోసిస్ 1.82 శాతం, టెక్ మహీంద్ర 1.39 శాతం, విప్రో 1.11 శాతం, మైండ్ ట్రీ 1.30 శాతం, కోఫోర్జ్ 2.49 శాతం ఎగిసింది.

జోబిడెన్ గెలుపు.. అమెరికా మార్కెట్లు జూమ్
అమెరికా మార్కెట్లు జోబిడెన్ గెలుపును స్వాగతిస్తున్నాయి! గతవారం ఫలితాలపై డైలమా కారణంగా నష్టాల్లో ముగిశాయి. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ డౌజోన్స్ 0.99 శాతం, నాస్‌డాక్ 1.28 శాతం, ఎస్ అండ్ పీ 1.02 శాతం పెరిగాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై స్పష్టత రావడంతో అగ్రరాజ్యం మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి.


Click it and Unblock the Notifications