Markets Crash: కరోనా కేసులతో కుప్పకూలిన మార్కెట్లు.. రూ.9 లక్షల కోట్లు ఆవిరి..
Stock Markets: ఉదయం ఉత్సాహంగా లాభాల ర్యాలీని కొనసాగించిన స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అన్ని ప్రధాన రంగాల్లోని కంపెనీల షేర్లు నేడు భారీ నష్టాలను చవిచూశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 931 పాయింట్ల నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 303 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 427 పాయింట్లు నష్టాలతో తన ప్రయాణాన్ని ముగించగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ అత్యధికంగా 1488 పాయింట్లను కోల్పోయింది.

స్టాక్ మార్కెట్లలో బుల్స్ వెనక్కి అడుగు వేయటంతో నేడి మార్కెట్ ముగియటానికి కొన్ని గంటల ముందు దలాల్ స్ట్రీట్ బేర్స్ చేతిలోకి చేజారిపోయింది. సెన్సెక్స్ దాని రికార్డు గరిష్ట స్థాయి 71,913 నుండి 1,611 పాయింట్లను క్రాష్ చేయగా, NSE నిఫ్టీ 50 ఆల్-టైమ్ హై 21,593 నుండి 506 పాయింట్లను పతనమైంది. అయితే మార్కెట్ల పతనానికి ఓవర్ వ్యాల్యుయేషన్లు కారణంగా మరికొందరు భావిస్తున్నారు. నిఫ్టీ 21000 లెవల్స్ కింది స్థాయిలో టెస్టింగ్ మరికొద్ది రోజులు కొనసాగుతుందని వెంచురా సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినిత్ బోలింజ్‌కర్ అంచనా వేశారు.
ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, బ్రిటానియా, సిప్లా కంపెనీల షేర్లు మాత్రమే లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి. ఇదే క్రమంలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, యూపీఎల్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా సహా మరిన్ని కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
వాస్తవానికి సెక్టార్ల వారీగా లాభాలను స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు మెుగ్గుచూపటం మార్కెట్లు అమాంతంగా పడిపోవటానికి కారణమని కొందరు నిపుణులు చెబుతున్నారు. కరోనా కేసుల ఆందోళలు మెుదలు కావటంతో ముందుగానే ఇన్వెస్టర్లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మెుత్తానికి అన్ని రంగాల్లోని షేర్లు దలాల్ స్ట్రీట్ లో రక్తమోడి ఇన్వెస్టర్లకు చెందిన లక్షల కోట్ల సంపదను గంటల్లోనే ఆవిరి చేశాయి.


Click it and Unblock the Notifications