Market News: దిమ్మతిరిగే ర్యాలీలో సెన్సెక్స్-నిఫ్టీ.. లక్షల కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు..
Market Closing Bell: కీలక బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాలతో నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి. ప్రధానంగా అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో కొనసాగాయి.

మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1241 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 387 పాయింట్ల మేర లాభాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 632 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 750 పాయింట్ల మేర పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలు నేటి మార్కెట్ల పరుగుకు ఊతంగా నిలిచాయి. దీంతో బుల్స్ దలాల్ స్ట్రీట్ ర్యాలీని సరికొత్త రికార్డు స్థాయిలకు చేర్చారని నిపుణులు వెల్లడించారు.
NSEలో ఓఎన్జీసీ, రిలయన్స్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఎల్ టి, కోటక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ లైఫ్, టైటాన్, సన్ ఫార్మా, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్నే నేడు ముగించాయి.
మార్కెట్లు ఇంత ర్యాలీని కొనసాగించినప్పటికీ సిప్లా, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎల్ టిఐఎమ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాలతో టాప్ లూజర్లుగా క్లోజింగ్ లో నిలిచాయి.


Click it and Unblock the Notifications