ముంబై: స్టాక్ మార్కెట్లు అదరగొట్టాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను మార్కెట్లు స్వాగతించాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం(ఫిబ్రవరి 1) నిర్మలమ్మ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ ప్రకటన సమయంలో, ఆ తర్వాత మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. మధ్యాహ్నం గం.2 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 2,051 పాయింట్లకు పైగా లాభపడి 48,337 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 563 పాయింట్లు ఎగిసి 14,198 పాయింట్ల వద్ద ఉంది. సెన్సెక్స్ దాదాపు 4.5 శాతం, నిఫ్టీ 4.13 శాతం మేర జంప్ చేశాయి.

సెన్సెక్స్ 2000 పాయింట్లు జంప్
2021-22 బడ్జెట్ మార్కెట్లకు సరికొత్త ఉత్సాహం ఇచ్చింది. కరోనా కారణంగా గత ఏడాది మార్చి నెలలో భారీగా పతనమైన మార్కెట్, ఆ తర్వాత అన్‌లాక్ వల్ల క్రమంగా కోలుకుంది. నవంబర్ నుండి సెన్సెక్స్ ఎప్పటికప్పుడు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. అయితే బడ్జెట్‌కు ఆరు సెషన్ల ముందు నుండి మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. ఓ సమయంలో 50వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్ ఆ తర్వాత 47వేల దిగువకు పడిపోయింది. దాదాపు 4వేల పాయింట్లు నష్టపోయింది. అయితే ఇప్పుడు బడ్జెట్ ప్రకటనతో మార్కెట్లు భారీగా ఎగిశాయి. సెన్సెక్స్ 2వేల పాయింట్ల వరకు ఎగిసి పడి, 48,000 పాయింట్లను దాటింది.

అందుకే మార్కెట్ జంప్
కరోనాను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలతో ఇన్వెస్టర్లు సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్ల దూకుడుకు కారణంగా భావిస్తున్నారు. ఆటో రంగం విషయానికి వస్తే కొత్త తుక్కు విధానం పట్ల ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించడం కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది. ఎన్పీఏ కోసం ప్రత్యేకంగా బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు ప్రకటనతో బ్యాంకింగ్ రంగ పుంజుకున్నాయి. 12 లక్షల కోట్ల రుణాల ప్రకటన నేపథ్యంలో టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ 14 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయి.

ఫార్మా మినహా అన్నీ జంప్
నిఫ్టీ బ్యాంకు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో ఇండస్ ఇండ్ బ్యాంకు 11 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 10 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 8 శాతం, ఎస్బీఐ 8 శాతం, లార్సన్ 8 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, సిప్లా, హెచ్‌యూఎల్ ఉన్నాయి.
నిఫ్టీ 50 స్టాక్స్ 3.66 శాతం, మిడ్ క్యాప్ 3.40 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో దాదాపు నాలుగు శాతం, బ్యాంకు 6 శాతానికి పైగా, ఎనర్జీ దాదాపు 2 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ దాదాపు 6 శాతం, ఎఫ్ఎంసీజీ 1.38 శాతం, ఐటీ 0.68 శాతం, మీడియా 2.34 శాతం, మెటల్ 2.58 శాతం, పీఎస్‌యు బ్యాంకు 5.43 శాతం, రియాల్టీ 4.24 శాతం, ప్రయివేటు బ్యాంకు 5.77 శాతం లాభపడ్డాయి. కేవలం ఫార్మా 1.26 శాతం నష్టపోయింది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..



Click it and Unblock the Notifications