Market Crash: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ర్యాలీకి ఇక బ్రేకేనా..??
Stock Market: నిన్న ఒడిదొడుకులను అధిగమించి లాభాల్లో ముగిసిన మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రధానంగా రిలయన్స్, టైటాన్, ఐడియా ఫోర్జ్ స్టాక్స్ ఫోకస్‌లో ఉన్నాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 50 పాయింట్ల మేర నష్టంలో ట్రేడవుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 247 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 80 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. చాలా కాలం కొనసాగిన ర్యాలీ తర్వాత మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ప్రతికూలతలు బలహీనమైన సంకేతాలను ఇస్తుండటంతో దేశీయ మార్కెట్లు వీక్ నోట్‌తో ప్రారంభమయ్యాయి. బలమైన ADP ఉద్యోగాల డేటా తర్వాత USలో రేట్ల పెంపు భయాల మధ్య బలహీనమైన ప్రపంచ సంకేతాలు శుక్రవారం ప్రారంభ ట్రేడ్‌లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లను తగ్గించాయి. దీనికి తోడు జూన్‌లో పారిశ్రామిక కార్యకలాపాలు బలహీనపడినట్లు చూపుతున్న చైనా డేటా కారణంగా పెరుగుతున్న మాంద్యం భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి.
ఎన్ఎస్ఈలో టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, టాటా కన్జూమర్, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, రిలయన్స్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టి, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, మారుతీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, బజాజ్ ఆటో, సిప్లా, నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, గ్రాసిమ్, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్స్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కొ, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications