Sensex Rally: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈవారం భారీ బుల్ మెుమెంటంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బెంచ్ మార్క్ సూచీలు తమ సరికొత్త జీవితకాల గరిష్ఠాల గత రికార్డులను వరుసగా బద్ధలకొడుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు భారీ ర్యాలీలో లాభాలను చూస్తున్నాయి.
ఉదయం 9.35 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీల రికార్డులను పరిశీలిస్తే.. సెన్సెక్స్ సూచీ 85372 పాయింట్ల మార్కును చేరుకోగా, మరో కీలక సూచీ నిఫ్టీ 26056 వద్ద తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో మిగిలిన బెంచ్ మార్క్ సూచీలు మాత్రం ఫ్లాట్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ భారీగా 210 పాయింట్లకు పైగా నష్టంతో ఉండగా, నిఫ్టీ బ్యాంక్ సూచీ 3 పాయింట్ల స్వల్ప లాభంతో ముందుకు సాగుతోంది. నేడు ప్రధానంగా దేశీయ స్టాక్ మార్కెట్లు అమెరికా ప్రకటించనున్న ద్రవ్యోల్బణం డేటా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

NSEలో మారుతీ, టాటా కన్జూమర్, ఎస్బీఐలైఫ్, ఎల్ టిఐఎమ్, టాటా మోటార్స్, ఐటీసీ, నెస్లే, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, ఎయిర్ టెల్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, హిందాల్కొ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బీపీసీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, ఎల్ టి, దివీస్ ల్యాబ్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications