Market Closing: నిన్నటి భారీ నష్టాల నుంచి తేరుకుని లాభాల్లో ప్రయాణాన్ని ప్రారంభించాయి ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు. అయితే ముందుగా సాగేందుకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పరిణామాలు కనిపించక పోవటంతో కొద్ది సేపటికే లాభాలు ఆవిరయ్యాయి. ప్రధానంగా రియల్టీ రంగంలోని కంపెనీలు లాభపడ్డాయి.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో కీలక సూచీలను గమనిస్తే.. సెన్సెక్స్ 184 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ 46 పాయింట్లను నష్టపోగా బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 2 పాయింట్ల లాభంలో ప్రయాణాన్ని ముగించింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం 234 పాయింట్ల లాభంతో దుమ్మురేపింది. అలాగే డాలర్ బలహీన పడటంతో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తే టోక్యో షేర్లు వరుసగా ఎనిమిదో రోజు లాభాల్లో ముగిశాయి. నిక్కీ 225 ఇండెక్స్ 0.51 శాతం లేదా 144.05 పాయింట్లు పెరిగి 28,658 వద్ద ముగిసింది. విస్తృత TOPICS ఇండెక్స్ 0.69 శాతం లేదా 13.92 పాయింట్లు పెరిగి 2,040కి చేరుకుంది.
మార్కెట్లు క్లోజింగ్ సమయానికి దివీస్ ల్యాబ్, హెచ్సీఎల్ టెక్, సిప్లా, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే, విప్రో, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, సన్ ఫార్మా, మారుతీ, హిందాల్కొ, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, టాటా స్టీల్, ఎల్ టి, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఈ క్రమంలో టాటా మోటార్స్ షేర్లు 8 నెలల గరిష్ఠాన్ని తాకాయి.
ఇదే క్రమంలో ఎన్ఎస్ఈ సూచీలో పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, టైటాన్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, హీరో మోటార్స్, గ్రాసిమ్, టాటా కన్జూమర్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, ఐటీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications