For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సరికొత్త రికార్డు సృష్టించిన మార్కెట్లు! సెన్సెక్స్ జంప్‌కు కారణాలెన్నో

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(ఆగస్ట్ 30) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 765 పాయింట్లు, నిఫ్టీ 225 పాయింట్లకు పైగా లాభపడింది.
ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరులో కనిపించాయి. కీలక రంగాలు రాణించడం రిలయన్స్, ఎయిర్‌టెల్, మారుతీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు దూసుకెళ్లాయి. ఇది ఇన్వెస్టర్లను ఉత్సాహపరిచింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, రూపాయి బలపడడం, FDIs వెల్లువ మార్కెట్ ర్యాలీకి దోహదపడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.27 వద్ద ముగిసింది. సెన్సెక్స్ చివరకు 56,329 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,958 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,309 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,775 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,951 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,764 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 765.04 (1.36%) పాయింట్లు లాభపడి 56,889.76 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 225.85 (1.35%) పాయింట్లు లాభపడి 16,931 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 57,000 పాయింట్ల సమీపానికి చేరుకుంది. ఈ మార్కుకు కేవలం 42 పాయింట్ల దూరం వరకు వచ్చింది. నిఫ్టీ కూడా ఓ దశలో 16,951 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఈ రెండు సూచీలకు ఇదే జీవితకాల గరిష్ఠ ముగింపు. సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, నెస్లే షేర్లు మినహా దాదాపు అన్ని కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అత్యధికంగా భారతీ ఎయిర్‌టెల్ 5.19 శాతం, యాక్సిస్ బ్యాంక్ 4 శాతం, టాటా స్టీల్ 3.75 శాతం, టైటాన్ 3.46 శాతం, మారుతీ 3.03 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.64 శాతం, ఎస్బీఐ 2.52 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.33 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.22 శాతం, రిలయన్స్ 2.12 శాతం లాభపడ్డాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి.

Sensex, Nifty hit record closing highs: Reasons behind surge

మార్కెట్ భారీ లాభాలకు పలు కారణాలు ఉన్నాయి. ఆటో, మెటల్ స్టాక్స్ భారీగా ఎగిసిపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ టాటా మోటార్స్, హిండాల్కో ఇండస్ట్రీస్ ఒక్కోటి రెండు శాతం చొప్పున లాభపడ్డాయి. ఆటో పార్ట్స్ సప్లయర్స్ భారత్ ఫోర్జ్ సోనా బీఎల్‌డబ్ల్యు ప్రిసిషన్ ఫోర్గింగ్స్, సంధార్ టెక్నాలజీస్ 6.2 శాతం నుండి 13.7 శాతం మేర లాభపడ్డాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవెల్ ప్రకటన సూచీలకు ఊతమిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలు కలిసి వచ్చాయి.

English summary

సరికొత్త రికార్డు సృష్టించిన మార్కెట్లు! సెన్సెక్స్ జంప్‌కు కారణాలెన్నో | Sensex, Nifty hit record closing highs: Reasons behind surge

Except IT, all other indices ended in the green with metal, pharma, PSU Bank rising 2 percent each. BSE midcap and smallcap indices rose 1.5 percent each.
Story first published: Monday, August 30, 2021, 19:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X