Stock Market: భారీ లాభాల్లో ముగిసిన Sensex, Nifty.. సరికొత్త రికార్డుకు సూచీలు..
Market Closing: భారత స్టాక్ మార్కెట్ సూచీలు రోజుకొక కొత్త రికార్డులను తాకుతూ చరిత్ర సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బుల్ ర్యాలీ మార్కెట్లలో కొనసాగుతోంది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 581 పాయింట్లు, నిఫ్టీ సూచీ 176 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 223 పాయింట్ల గెయిన్ అవ్వగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 416 పాయింట్ల మేర లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ సూచీ తన కొత్త జీవితకాల గరిష్ఠమైన 66,159.79 మార్కును నేడు తాకగా.. మరో సూచీ నిఫ్టీ సరికొత్త లైఫ్ టైమ్ హై అయిన 19,595.35ను తాకింది.

ఎన్ఎస్ఈలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్టిఐఎమ్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కొ, ఐషర్ మోటార్స్, విప్రో, టాటా స్టీల్, హీరో మోటార్స్, టాటా కన్జూమర్, దివీస్ ల్యాబ్స్, నెస్లే, యూపీఎల్, అదానీ పోర్ట్స్, సిప్లా, ఎల్ టి, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే సమయంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటాన్, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications