ముంబై: వరుస ఆరు రోజుల మార్కెట్ లాభాలకు ఈరోజు (ఫిబ్రవరి 9 మంగళవారం) బ్రేక్ పడింది. మార్కెట్లు దాదాపు స్థిరంగా ముగిశాయి. బడ్జెట్ అనంతరం 46,000 పాయింట్ల స్థాయి నుండి 51,000 పాయింట్ల స్థాయికి చేరిన సెన్సెక్స్, ఆ మార్కు పైనే ముగిసింది. అయితే చివరకు అతి స్వల్ప నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఉదయం నుండి భారీ లాభాల్లో ఉన్న మార్కెట్లు, చివరి గంట-అరగంటలో నష్టాల్లోకి వెళ్లాయి. ఇన్వెస్టర్లు చివరలో ప్రాఫిట్ బుకింగ్‌కు ఎగబడటంతో భారీ లాభాలు నిలబడలేకపోయాయి. ఆటో, ఫార్మా, మెటల్ స్టాక్స్ మార్కెట్లను చివరలో కిందకు లాగాయి.

స్వల్పంగా నష్టపోయిన మార్కెట్
సెన్సెక్స్ 19.69 పాయింట్లు లేదా 0.04% నష్టపోయి 51,329.08 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 6.50 పాయింట్లు లేదా 0.04% నష్టపోయి 15,109.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1279 షేర్లు లాభాల్లో, 1634 షేర్లు నష్టాల్లో ముగియగా, 184 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ ఉదయం 51,484 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఓ సమయంలో 51,836 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది, 51,193 వద్ద కనిష్టాన్ని తాకింది. 600 పాయింట్లకు పైగా కదలాడింది. నేటి గరిష్టం నుండి 500 పాయింట్లు పడిపోయింది.
డాలర్ మారకంతో రూపాయి 8 పైసలు బలపడి 72.88 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 72.88 వద్దనే ప్రారంభమైంది. నేటి సెషన్లో 72.84-72.93 మధ్య ట్రేడ్ అయింది. నిన్న 72.96 వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 3.72 శాతం, SBI లైఫ్ ఇన్సురా 3.45 శాతం, HDFC లైఫ్ 3.05 శాతం, ONGC 1.35 శాతం, టైటాన్ కంపెనీ 1.18 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో IOC 6.15 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 3.60 శాతం, టాటా మోటార్స్ 3.24 శాతం, JSW స్టీల్ 2.68 శాతం, బజాజ్ ఆటో 1.95 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఏషియన్ పేయింట్స్, రిలయన్స్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు స్వల్పంగా లాభపడి రూ.1954 వద్ద ముగిసింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.04 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.04 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ బ్యాంకు 0.20 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.12 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.25 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.18 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఆటో 1.39 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.64 శాతం, నిఫ్టీ ఐటీ 0.53 శాతం, నిఫ్టీ మీడియా 1.87 శాతం, నిఫ్టీ మెటల్ 1.09 శాతం, నిఫ్టీ ఫార్మా 1.22 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.40 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.67 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications