Stock Market: లాభాల దుమ్ముదులిపిన స్టాక్ మార్కెట్లు.. అంతా ఆ రెండింటి దయ..
Market Closing: ఉదయం ఊపుతో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు అదే జోరును చివరి వరకు కొనసాగించాయి. ప్రధానంగా ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లోని షేర్లు మార్కెట్లను నేడు ముందుకు నడిపించాయి.
మార్కెట్ క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 467 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 138 పాయింట్ల మేర గెయిన్ అయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 495 పాయింట్ల లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ 237 పాయింట్ల లాభంతో వారాంతపు రోజున సూచీలు ట్రేడింగ్ ముగించాయి.

మార్కెట్లో అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగియటంతో.. నేడు మార్కెట్ క్యాప్ రూ.292.70 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు నేడు మార్కెట్ల ర్యాలీకి దోహదపడ్డాయి.
ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, యూపీఎల్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కొ, హిందుస్థాన్ యూనీలివర్, రిలయన్స్, సిప్లా, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే సమయంలో విప్రో, బజాజ్ ఆటో, టీసీఎస్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ప్రయాణం ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications