ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. గం.9.16 సమయానికి సెన్సెక్స్ 154.05 పాయింట్లు లేదా 0.42% ఎగిసి 36,483.06 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు లేదా 0.37% లాభపడి 10,745.80 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత మధ్యాహ్నం గం.12.47 సమయానికి సెన్సెక్స్ 315 పాయింట్ల లాభాల్లోకి వెళ్లింది. 740 షేర్లు లాభాల్లో, 327 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
మధ్యాహ్నం సమయానికి ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ రంగాలు మినహా మిగతావి లాభాల్లో ఉన్నాయి. ఫైనాన్షియల్, మెటల్ స్టాక్స్ భారీగా ఎగిశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్, విప్రో, టెక్ మహీంద్రా, యూపీఎల్ ఉన్నాయి.

నిన్న అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా ఉన్నాయి. నేడు ఐటీ దిగ్గజం టీసీఎస్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనుంది. మొత్తం 19 కంపెనీలు ప్రకటించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
అయిదు రోజుల పాటు వరుసగా లాభాలు మూటగట్టుకున్న మార్కెట్లు నిన్న నష్టపోయిన విషయం తెలిసిందే. ట్రేడింగ్ చివరలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ 346 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 94 పాయింట్ల నష్టంతో ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి కూడా 9 పైసలు తగ్గి 75.02 వద్ద ముగిసింది. నేడు తిరిగి కోలుకున్నాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..



Click it and Unblock the Notifications