ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జూలై 2) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం ఓ సమయంలో కాస్త లాభాల్లోకి వచ్చినట్లుగా కనిపించినప్పటికీ మళ్లీ పతనమయ్యాయి. మొత్తానికి నేడు ఊగిసలాటలో ఉన్నాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 140 పాయింట్లకు పైగా నష్టపోయింది. అమెరికా మార్కెట్లు నిన్న లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఈ రోజు మిశ్రమంగా ఉన్నాయి. దేశీయంగా ఎలాంటి సానుకూల సంకేతాలు లేకపోవడం, తయారీ రంగ గణాంకాలు సూచీలపై ప్రభావం చూపాయి.

ఊగిసలాటలో మార్కెట్లు
సెన్సెక్స్ మధ్యాహ్నం గం.12.30 సమయానికి 24.19 (0.046%) పాయింట్లు ఎగిసి 52,342.79 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 6.75 (0.043%) పాయింట్లు ఎగిసి 15,686.75 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 52,434.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,436.83పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,177.68 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,705.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,711.20 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,635.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో గ్లాండ్ 2.47 శాతం, అదానీ పోర్ట్స్ 1.85 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.58 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.55 శాతం, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 1.43 శాతంగా ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్ 1.24 శాతం, JSW స్టీల్ 1.18 శాతం, బ్రిటానియా 1.11 శాతం, టీసీఎస్ 1.10 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 0.95 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, HDFC బ్యాంకు, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.07 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.19 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.02 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.37 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.15 శాతం, నిఫ్టీ మీడియా 0.68 శాతం, నిఫ్టీ ఫార్మా 0.49 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.51 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.09 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.12 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎనర్జీ .0.16 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.33 శాతం, నిఫ్టీ ఐటీ 0.65 శాతం, నిఫ్టీ మెటల్ 0.62 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications