Market today: మార్కెట్లు లాభాల్లో నుండి నష్టాల్లోకి, కారణాలివే
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ఉన్నాయి. లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గరిష్టాల వద్ద కొనుగోళ్ల ఒత్తిడి కనిపిస్తోంది. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీనికి తోడు వివిధ దేశాల్లో కరోనా కేసులు పుట్టుకు వస్తున్నాయి. దీంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. గతవారం 100 డాలర్ల దిగువన ముగిసిన చమురు ధర ఇప్పుడు మళ్లీ 110 డాలర్లకు చేరువైంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, వివిధ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్, లాక్ డౌన్ వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి.
సెన్సెక్స్ ఉదయం దాదాపు 200 పాయింట్లు లాభపడి 58,030 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 58,126 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,569 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,329 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,353 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,209 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 95 పాయింట్లు నష్టపోయి 57,768 పాయింట్ల వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు క్షీణించి 17,263 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

అదానీ గ్రూప్ సౌదీ అరేబియాలో ఇన్వెస్ట్ చేయడానికి, భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి యోచిస్తోంది. ఇందులో భాగంగా దిగ్గజ చమురు ఎగుమతి సంస్థ సౌదీ ఆరామ్‌కోలో వాటా కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇండియన్ ఆయిల్, బీపీఎల్, హెచ్‌సీఎల్.. బల్క్ డీజిల్ యూజర్లకు రూ.25 పెంచాయి. రిటైల్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిలో ఉండగా, మెటల్, ఐటీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications