నిన్న 53,000 మార్కు క్రాస్ చేసి నేడు ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం(జూన్ 23) లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లోకి వెళ్లాయి. వివిధ కారణాలతో మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదులుతున్నాయి. అయితే, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో షేర్ల విలువ నిన్న భారీగా ఎగిసిపడటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూచీలు అప్రమత్తంగా కలాడుతున్నాయి. బీఎస్ఈ 30 స్టాక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంకు, టైటాన్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ లాభాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ నిన్న 53000 మార్కును దాటి కిందకు వచ్చింది. ఈ రోజు ఊగిసలాటలో ఉంది.

ఊగిసలాటలో మార్కెట్లు
సెన్సెక్స్ ఉదయం 52,912.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,912.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,434.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,862.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,862.95 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,726.60 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ మధ్యాహ్నం గం.12.15 సమయానికి 73.22 (0.14%) పాయింట్లు నష్టపోయి 52,515.49 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 13.30 (0.084%) పాయింట్లు నష్టపోయి 15,759.40 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ 2.67 శాతం, హీరో మోటో కార్ప్ 1.77 శాతం, హిండాల్కో 1.40 శాతం, టైటాన్ కంపెనీ 1.07 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.97 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో విప్రో 2.24 శాతం, శ్రీసిమెంట్స్ 1.33 శాతం, అదాని పోర్ట్స్ 0.97 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 0.92, HDFC 0.71 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, కొటక్ మహీంద్రా, రిలయన్స్, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.07 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.66 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1.07 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.10 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.00 శాతం, నిఫ్టీ మీడియా 0.22 శాతం, నిఫ్టీ మెటల్ 0.28 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.11 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.56 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎనర్జీ 0.30 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.16 శాతం, నిఫ్టీ ఐటీ 0.47 శాతం, నిఫ్టీ ఫార్మా 0.07 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.05 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications