Stock Market: నష్టాలను చెరిపేస్తూ లాభాల్లోకి నిఫ్టీ, సెన్సెక్స్.. బ్యాంక్ స్టాక్స్ మాత్రం..
Market Closing: నేడు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో కొంత ఒడిదొడుకుల్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే చివరికి నష్టాలను చెరిపేసి లాభాల్లోకి వచ్చి కొత్త ఏడాది తొలిరోజు లాభాల ముగింపును నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 11 పాయింట్ల మేర స్వల్ప లాభాలతో 2024 తొలిరోజు ట్రేడింగ్ ముగించాయి. అయితే ఈ క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 58 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 291 పాయింట్ల మేర భారీ లాభంతో క్లోజ్ అయ్యింది. అయితే నిపుణులు పాజిటివ్ మెుమెంటం తిరిగి వస్తుందని భావిస్తున్నారు.

ఎన్ఎస్ఈలో నెస్లే, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యూపీఎల్, ఐటీసీ, విప్రో, అపోలో హాస్పిట్ల్స్, ఇన్ఫోసిస్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, రిలయన్స్, టైటాన్, బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని టాప్ గెయినర్లుగా నేడు ముగించాయి.
ఇదే క్రమంలో ఐషర్ మోటార్స్, ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, హిందాల్కొ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, గ్రాసిమ్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ, హిందుస్థాన్ యూనీలివర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఎల్ టి, హీరో మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని జనవరి 1న ముగించాయి.


Click it and Unblock the Notifications