భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, రికార్డ్‌స్థాయికి..: రూపాయి అదరగొట్టింది

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరోరోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్ల అండతో గరిష్టస్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుండి ఈ మార్క్ అందుకోవడం ఇది మొదటిసారి. ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంకు షేర్లు రాణించడంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. బ్యాంకింగ్ వ్యవస్థ ఇప్పటికీ బలంగాఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వ్యాఖ్యలు చేయడంతో ఆ ప్రభావం స్టాక్స్ పైన పడింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కాస్త ఒడిదుడుకులకు లోనైనప్పటికీ మంచి లాభాల్లో క్లోజ్ అయ్యాయి.

బ్యాంకింగ్ జూమ్

బ్యాంకింగ్ జూమ్

సెన్సెక్స్ 353.84 పాయింట్లు (0.9 శాతం) లాభపడి 39,467.31 వద్ద, నిఫ్టీ 88.30 పాయింట్లు(0.76 శాతం) ఎగిసి 11,647.60 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు భారీగా లాభపడ్డాయి. టాప్ గెయినర్స్ జాబితాలో కూడా వరుసగా ఇవే ఉండటం గమనార్హం. టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంకు, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, సన్ ఫార్మా ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో జేఎస్‌డబ్ల్యు స్టీల్, హీరో మోటో కార్ప్, పవర్ గ్రిడ్ కార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. బ్యాంకింగ్ ఇండెక్స్ 4 శాతం లాభపడింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ అరశాతం, నిఫ్టీ ఆటో, అరశాతం లాభపడింది.

నెలలో గరిష్ట వీక్లీ లాభం

నెలలో గరిష్ట వీక్లీ లాభం

- సెన్సెక్స్, నిఫ్టీలకు నెలలో అతిపెద్ద వీక్లీ లాభం ఇది. నిఫ్టీ బ్యాంకుకు 3 నెలల గరిష్టం.

- మిడ్ క్యాప్ ఇండెక్స్ వరుసగా నాలుగో వారం లాభపడింది. నెలలో గరిష్ట లాభాలు నమోదు చేసింది.

- ఈ వారంలో సెన్సెక్స్ 2.7 శాతం, నిఫ్టీ 2.4 శాతం, నిఫ్టీ బ్యాంకు 10 శాతం లాభపడింది.

- మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.3 శాతం లాభపడింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ఈ వారంలో 8 శాతం లాభపడ్డాయి.

- ఈ వారంలో ఇండస్ ఇండ్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ టాప్ నిఫ్టీ గెయినర్స్.

- శ్రీ సిమెంట్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిట్ టాప్ నిఫ్టీ లూజర్స్.

బలపడిన రూపాయి

బలపడిన రూపాయి

రూపాయి ఆరు నెలల గరిష్టానికి చేరుకుంది. వరుసగా మూడో సేషన్‌లో లాభపడింది. ఈ వారంలో డాలర్ మారకంతో రూపాయి 2 శాతం ఎగిసింది. గత ఏడాది డిసెంబర్ 21వ తేదీతో ముగిసిన వారంలో 2.4 శాతం లాభపడగా, ఆ తర్వాత ఓ వారంలో భారీగా లాభపడటం (2 శాతం) ఇదే మొదటిసారి. రూపాయి 73.40 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 73.81 వద్ద క్లోజ్ అయింది. నేటి సెషన్‌లో ఓ సమయంలో 73.28 కూడా పలికింది. మార్చి 5వ తేదీ తర్వాత ఈస్థాయికి బలపడటం గమనార్హం. ఈ రోజు 73.28 నుండి 73.87 మధ్య ట్రేడ్ అయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+