ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్: లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమై, ఆర్బీఐ నిర్ణయాల అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. కొన్ని కీలక రంగాల్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలను కిందకు దిగజారాయి. సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా నష్టపోయినప్పటికీ 52వేల పాయింట్లకు పైనే ముగిసింది. నిప్టీ 15,700 దిగువకు పడిపోయింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ మినహా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున ఎగిశాయి. మార్కెట్లు నిన్న భారీ లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే.

లాభాల నుండి నష్టాల్లోకి మార్కెట్లు
సెన్సెక్స్ నేడు ఉదయం 52,367.52 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,389.02 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,952.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 132.38 (0.25%) పాయింట్లు క్షీణించి 52,100.05 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,712.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,733.60 వద్ద గరిష్టాన్ని, 15,622.35 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 20.10 (0.13%) పాయింట్లు క్షీణించి 15,670.25 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో గ్రాసీమ్ 3.05 శాతం, టాటా మోటార్స్ 2.86 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.84 శాతం, కోల్ ఇండియా 2.72 శాతం, ఓఎన్జీసీ 2.41 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో నెస్ట్లే 1.51 శాతం, హిండాల్కో 1.44 శాతం, టాటా స్టీల్ 1.13 శాతం, HUL 0.92 శాతం, SBI టెక్ 0.88 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో SBI, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.13 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.91 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో 0.83 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.20 శాతం, నిఫ్టీ ఐటీ 0.03 శాతం, నిఫ్టీ మీడియా 1.02 శాతం, నిఫ్టీ మెటల్ 1.35 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.48 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 1.00 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.22 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.36 శాతం, నిఫ్టీ ఫార్మా 0.09 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.16 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.81 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications