స్టాక్ మార్కెట్లు మంగళవారం (డిసెంబర్ 14) భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్న 500 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్, నేడు 166 పాయింట్లు దిగజారింది. నేడు కూడా ఓ సమయంలో దాదాపు 500 పాయింట్ల మేర క్షీణించినప్పటికీ, మధ్యాహ్నం కాస్త కోలుకుంది. సూచీలు నేడు నష్టాల్లోనే... రోజంతా ఊగిసలాటలో కదలాడాయి. భారీ పతనం నుండి కాస్త పుంజుకొని, స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం గం.2 సమయానికి స్వల్ప లాభాల్లో కనిపించి, వెంటనే పడిపోయాయి. ఈ వారం వరుసగా రెండు రోజులు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

అందుకే నష్టాల్లో...
వివిధ దేశాల్లో సెంట్రల్ బ్యాంకుల సమావేశాలు ఈ వారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్దీపనల ఉపసంహరణలు క్రమంగా ప్రారంభం కానున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ విషయానికి వస్తే ద్రవ్యోల్బణ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైల్, హోల్ సేల్ ద్రవ్యోల్బణాలు పెరిగాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పైన ప్రభావం చూపింది. రూపాయి వ్యాల్యూ 18 నెలల కనిష్ఠానికి పడిపోయింది. ఆసియా మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి.

500 పాయింట్ల మేర పైకి కిందకు
సెన్సెక్స్ నేడు ఉదయం 58,059.76 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,322.42 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,803.87 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,283.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,376.20 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,225.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 166.33 (0.29%) పాయింట్లు నష్టపోయి 58,117.09 పాయింట్ల వద్ద, నిఫ్టీ 43.35 (0.25%) పాయింట్లు క్షీణించి 17,324.90 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు 500 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది.

ఈ స్టాక్స్ 15 శాతం జంప్
మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ పలు స్టాక్స్ 15 శాతానికి పైగా లాభపడ్డాయి. హిందూస్తాన్ ఫ్లూరో(20.0%), SP క్యాపిటల్ ఫిన్ (20.0%), పెరల్ పాలీమర్స్ (20.0%), NDTV(19.99%), జూంక్‌టాలీ టీ(19.99%), పంత్ ఇన్‌ఫినిటీ(19.98%), MT ఎడ్యుకేర్ (19.98%), ఆర్టిన్ ల్యాబ్స్(19.97%), సూరత్ టెక్స్ టైల్స్ (19.96%), ప్రితీష్ నాండీ (19.94%) కంపెనీలు లాభపడ్డాయి.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications