ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఫిబ్రవరి 16) స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం నుండి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ నిన్న చరిత్రలో తొలిసారి 52,000 పాయింట్ల మార్కు దాటింది. నిఫ్టీ 15,300 పాయింట్ల పైన స్థిరపడింది. నేడు ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, లాభనష్టాల్లో ఊగిసలాడాయి. చివరకు స్వల్ప నష్టాలు లేదా దాదాపు స్థిరంగా ముగిశాయి. ఈ ఏడాది జనవరి 4న 48,000 తాకిన సెన్సెక్స్, జనవరి 11న 49,000ను, జనవరి 21న 50,000 మార్కును తాకింది. బడ్జెట్‌కు వారం ముందు సూచీలు పడిపోయి 46000 స్థాయికి దిగజారాయి. బడ్జెట్ తర్వాత పుంజుకొని కొద్ది సెషన్లలోనే 6,000 పాయింట్లు పెరిగి 52,000 మార్కును దాటింది.

భారీ లాభాల నుండి...
సెన్సెక్స్ నిన్న 52,154 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా, నేడు 49.96 పాయింట్లు లేదా 0.10 శాతం నష్టపోయి 52,104 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 52,400 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,516 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,863 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 650 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. నిఫ్టీ 1.25 (0.0082%) పాయింట్లు నష్టపోయి 15,313 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 15,371.45 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,431.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,242.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 6.17 శాతం, ONGC 5.38 శాతం, టాటా స్టీల్ 4.02 శాతం, హిండాల్కో 3.88 శాతం, ఎన్టీపీసీ 2.80 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు 2.39 శాతం, ICICI బ్యాంకు 2.31 శాతం, ఐచర్ మోటార్స్ 1.56 శాతం, నెస్ట్లే 1.50 శాతం, ఇన్ఫోసిస్ 1.47 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, టాటా స్టీల్, టాటా మోటార్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు 1.27 శాతం లాభపడి రూ.2,058 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.01 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.38 శాతం లాభపడ్డాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఎనర్జీ 2.34 శాతం, నిఫ్టీ మెటల్ 2.89 శాతం, నిఫ్టీ ఫార్మా 0.46 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.65 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.27 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.10 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.56 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.32 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.69 శాతం, నిఫ్టీ ఐటీ 1.49 శాతం, నిఫ్టీ మీడియా 0.77 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.45 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications