నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: సెన్సెక్స్ 127 పాయింట్లు డౌన్, నిఫ్టీ 17,350 పాయింట్ల పైన...
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(సెప్టెంబర్ 13) నష్టాల్లో ముగిశాయి. గత వారం సూచీలు ఊగిసలాటలో కనిపించాయి. ఈ వారం నష్టాలతో ప్రారంభించింది. దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర సెన్సెక్స్ భారీ నష్టానికి కారణమైంది. రిలయన్స్ ఏకంగా 2.30 శాతం లేదా రూ.55.80 క్షీణించి రూ.2,369.80 వద్ద ముగిసింది. సూచీలపై హెవీ వెయిట్ (రిలయన్స్) ప్రభావం ఎక్కువగా కనిపించింది. సూచీలు నేడు ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య సాగాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు మధ్యాహ్నం వరకు అలాగే ఉన్నాయి. తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్ల అండతో కాసేపు లాభాల్లోకి ఉన్నాయి. చివరకు మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో లాభాలు ఆవిరయ్యాయి. రిలయన్స్‌తో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, HUL, HDFC బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీలు సూచీలను ప్రభావితం చేశాయి. మిడ్, స్మాల్ క్యాప్స్
సెన్సెక్స్ ఉదయం 58,262.11 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,314.64 వద్ద గరిష్టాన్ని, 57,944.63 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,363.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,378.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,269.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 127.31 (0.22%) పాయింట్లు నష్టపోయి 58,177.76 పాయింట్ల వద్ద, నిఫ్టీ -13.95 (-0.08%) పాయింట్లు నష్టపోయి 17,355.30 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.68 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో 10 నష్టపోయాయి. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, HUL, HDFC బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా నష్టపోయాయి.

టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, మారుతీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, HCL టెక్, HDFC షేర్లు లాభపడ్డాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, HDFC, టాటా స్టీల్, హిండాల్కో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా 4 శాతం, హిండాల్కో 3.19 శాతం, టీసీఎస్ 1.42 శాతం, బీపీసీఎల్ 1.42 శాతం, విప్రో 1.27 శాతం లాభపడ్డాయి. రిలయన్స్ 2.23 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.78 శాతం, HUL 0.86 శాతం, HDFC బ్యాంకు 0.83 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.69 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications