ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (సెప్టెంబర్ 8) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 64.53 పాయింట్లు (0.17%) నష్టపోయి 38,352.70 వద్ద, నిఫ్టీ 17.10 పాయింట్లు (0.15%) నష్టపోయి 11,337.90 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్లు, సాయంత్రం క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ 52 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 38,365 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,317 వద్ద క్లోజ్ అయింది.

అందుకే నష్టాల్లో మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, దేశీయ పరిమాణాలు, చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, కరోనా కేసులు రోజురోజుకు పెరగడం వంటి వివిధ కారణాల వల్ల ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో సూచీలు ఆద్యంతం ఒడిదుడుకుల్లో కనిపించాయి. మధ్యాహ్నం గం.11 తర్వాత కాస్త పుంజుకున్నట్లు కనిపించినప్పటికీ అంతలోనే అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లు నష్టపోయాయి. 957 షేర్లు లాభాల్లో, 1695 షేర్లు నష్టాల్లో ముగియగా, 170 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

ఐటీ సంస్థలు జూమ్
ఈరోజు ఐటీ స్టాక్స్ భారీగా పుంజుకున్నాయి. మిగతా అన్ని రంగాలు అన్నీ నష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1శాతం నుండి 1.5 శాతం మధ్య లాభపడ్డాయి. టాప్ గెయినర్స్ జాబితాలో బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, రిలయన్స్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, టాటా స్టీల్, హిండాల్కో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్ 2.4 శాతం, ఇన్ఫోసిస్ 1.5 శాతం, విప్రో 1.33 శాతం మేర లాభపడ్డాయి.

నిఫ్టీ మెటల్ భారీ డౌన్
నిఫ్టీ మెటల్ ఇండెక్స్ భారీగా నష్టపోయింది. ఇది ఏకంగా 3 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా 1.6 శాతం, బ్యాంకింగ్ రంగం 1 శాతం, ఆటో రంగం 0.8 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ 1 శాతం మేర పెరిగింది. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో 1.5 శాతం నుండి 3 శాతం మేర పెరిగాయి.


Click it and Unblock the Notifications