ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఆగస్ట్ 7) ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. ఉదయంకూడా ఫ్లాట్‌గానే ప్రారంభమైన మార్కెట్లలో ఆద్యంతం ఒడిదుడుకులు కొనసాగి, చివరకు అతిస్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు లాభపడి 38,040 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లు ఎగిసి 11,214 వద్ద ముగిసింది.
మార్కెట్లు ముగిసే సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా ఉన్నాయి. ఐటీ, ఫార్మా రంగాలు నష్టాల్లో ముగిశాయి. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

మార్కెట్లను ప్రభావితం చేయగలిగే అంశాలు లేకపోవడం, ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, వారంతం కావడం, కరోనా కేసులు పెరగడం వంటి వివిధ అంశాలు మార్కెట్లు ఫ్లాట్‌గా ఉండేందుకు కారణంగా కనిపిస్తోంది. ట్రంప్ నిర్ణయం సహా వివిధ కారణాలతో ఐటీ రంగం ఇంకా ఒత్తిడిలోనే కొనసాగుతోంది.
డాలర్ మారకంతో రూపాయి ఓ సమయంలో 12 పైసలు నష్టపోయి 75.05 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత కోలుకొని చివరకు 74.93 వద్ద క్లోజ్ అయింది. 74.91 నుండి 75.05 మధ్య ట్రేడ్ అయింది. రూపాయి ఈ ఏప్రిల్ నెలలో డాలర్ మారకంతో 76.91 వద్ద ఆల్ టైమ్ కనిష్టం వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications