భారీ నష్టాల నుండి లాభాల్లోకి మార్కెట్లు, 187 పాయింట్ల లాభాల్లో సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ప్రారంభమై, భారీ నష్టాల్లోకి వెళ్లి, ఆ తర్వాత తిరిగి లాభాల్లోకి వచ్చాయి. రోజంతా ఊగిసలాటలో కనిపించింది. ఇన్వెస్టర్లు సెల్ ఆన్ ర్యాలీ వైఖరిని అవలంభించినట్లుగా కనిపిస్తోంది. ఉదయం ఓ సమయంలో దాదాపు 600 పాయింట్ల మేర నష్టపోయింది. కానీ అంతలోనే కోలుకొని, లాభాల్లోకి వచ్చింది. మధ్యాహ్నం స్వల్ప నష్టాల్లోకి వెళ్లినప్పటికీ, చివరి అరగంటలో లాభాల్లోకి వచ్చింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 74.73 వద్ద ముగిసింది.

సెన్సెక్స్, నిఫ్టీ
నేడు ఉదయం సెన్సెక్స్ 57,799.67 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,925.82 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,058.77 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,279.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,306.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,043.65 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు +187.39 (0.33%) పాయింట్లు ఎగిసి 57,808.58 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53.15 (0.31%) పాయింట్లు ఎగిసి 17,266.75 పాయింట్ల వద్ద ముగిసింది.

ప్రతికూల సంకేతాలు
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు కనిపించాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అమెరికా మార్కెట్లు సోమవారం ఊగిసలాటలో పయనించాయి. యూఎస్ ఫ్యూచర్స్ ప్రతికూలంగా చలిస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం టెక్ స్టాక్స్ నష్టపోయాయి. అమెరికాలో ద్రవ్యోల్భణ భయాలు, ఉద్దీపనల ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపు వంటి ఆందోళనలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఎఫ్ఐఐల అమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇవి మాత్రమే లాభాల్లో..
ఆటో, మెటల్, ఫార్మా పీఎస్‌యూ బ్యాంకు సూచీలు మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగతా స్టాక్స్ అన్నీ నష్టాల్లో ముగిశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్ప్, ఐవోసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications