ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 6వ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఏడు నెలల గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 303.72 పాయింట్లు (0.76%) లాభపడి 40,182.67 వద్ద, నిఫ్టీ 95.70 పాయింట్లు (0.82%) ఎగిసి 11,834.60 పాయింట్ల వద్ద ముగిసింది. 1,215 షేర్లు లాభాల్లో, 1,419షేర్లు నష్టాల్లో ముగియగా, 159 షేర్లలో ఎలాంటి మార్పు లేకుండా క్లోజ్ అయ్యాయి. అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి. ఐటీ ఇండెక్స్ ఏకంగా 3 శాతం లాభపడింది. ఫార్మా, బ్యాంకు స్టాక్స్ కూడా మంచి లాభాలు నమోదు చేశాయి. అందుకు విరుద్ధంగా ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి.

ఐటీ స్టాక్స్ అదరగొట్టాయి
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సహా వివిధ ఐటీ రంగ సంస్థల స్టాక్స్ ఎగిశాయి. దీంతో నిఫ్టీ ఐటీ భారీ లాభాల్లో ముగిసింది. ఐటీ స్టాక్స్‌లో చాలా వరకు రికార్డులు నెలకొల్పాయి. దీంతో నిఫ్టీ ఐటీ 16 ఏళ్ల గరిష్టాన్ని తాకింది.
టీసీఎస్ షేర్ ధర 3 శాతం లాభపడి రూ.2,818, హెచ్‌సీఎల్ టెక్ 2.59 శాతం ఎగిసి రూ.850 వద్ద, ఇన్ఫోసిస్ షేర్ ధర 2.62 శాతం పెరిగి రూ.1,094 వద్ద, టెక్ మహీంద్ర షేర్ 1.91 శాతం ఎగిసి రూ.862.50, విప్రో షేర్ ధర 7.34 శాతం లాభపడి రూ.359.90 వద్ద, కోఫోర్జ్ షేర్ 3.28 శాతం లాభపడి రూ.2,474 వద్ద, మైండ్ ట్రీ షేర్ 5.77 శాతం లాభపడి రూ.1,468 వద్ద ముగిసింది. ఐటీ స్టాక్స్‌లో విప్రో 7 శాతానికి పైగా లాభాల్లో ముగిసింది. విప్రో బోర్డు కూడా షేర్ల బైబ్యాక్‌కు సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడంతో స్టాక్ 20 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. అక్టోబర్ 13న బైబ్యాక్ పైన ప్రకటన చేయవచ్చు.

ప్రాఫిట్ బుకింగ్
నిఫ్టీ బ్యాంకు 227 పాయింట్లు లాభపడి 23,191 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 18 పాయింట్లు ఎగిసి 17,146 వద్ద క్లోజ్ అయింది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలో ప్రాఫిట్ బుకింగ్‌లో కనిపించాయి. నిన్న ఈ స్టాక్స్ భారీగా లాభపడటంతో ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. వేదాంత స్టాక్స్ ఒత్తిడిలో కూరుకుపోయాయి. ఈ వారం ఇప్పటి వరకు 14 శాతం నష్టపోయింది. జస్ట్ డయల్, కాడిల్లా హెల్త్ కేర్, బయోకాన్, అపోలో హాస్పిటల్స్ లాభాల్లో ముగిశాయి.

చివరి గంటలో..
టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో, సిప్లా, టీసీఎస్, అల్ట్రా టెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో గెయిల్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఐచర్ మోటార్స్, కోల్ ఇండియా ఉన్నాయి. నేడు యాక్టివ్ స్టాక్స్‌లో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు 0.71 శాతం నష్టపోయి 2,241.50 వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్ల దిశగా దూసుకెళ్లింది. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో 303 పాయింట్ల లాభాలతో ముగిసింది.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications