స్టాక్ మార్కెట్లు సోమవారం (జూలై 20) లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్ల అండతో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ 11 వేల మార్క్ అందుకుంది. సెన్సెక్స్ 399 పాయింట్లు ఎగిసి 37,419 పాయింట్లకు, నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 11,022 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం వ్యాల్యూ 74.92గా ఉంది.

ఫార్మా రంగం మినహా.. లాభాలు
టాప్ గెయినర్స్ జాబితాలో బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్ సర్వ్, యూపీఎల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో సన్ ఫార్మా, సిప్లా, జీ ఎంటర్టైన్మెంట్, బీపీసీఎల్, ఎన్టీపీసీ ఉన్నాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఫార్మా రంగం మినహా అన్ని షేర్లు లాభాల్లోనే క్లోజ్ అయ్యాయి. ఇటీవల క్వార్టర్ 1 ఫలితాల్లో రాణించిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు నేటి ట్రేడింగ్‌లో దూసుకెళ్లాయి. 3 శాతం మేర షేర్ వ్యాల్యూ పెరిగింది.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ)లు రూ.697 కోట్ల విలువైన స్యాక్స్ కొనుగోలు చేయగా, దేశీ ఫండ్స్ (డీఐఐ) రూ.209 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ.1,091 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, డీఐఐలు రూ.1,660 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఐటీ రంగం 2.6 శాతం అప్
ఎన్ఎస్ఈలో ఫార్మా (1.6 శాతం) నష్టపోయింది. మిగిలిన అన్ని రంగాలు బలపడ్డాయి. ఐటీ రంగం 2.6% పుంజుకోగా, బ్యాంకు నిఫ్టీ 1.6% ఎగిసింది. నిఫ్టీ దిగ్గజాలలో బ్రిటానియా, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, బజాజ్ ఫిన్, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మూడు శాతం నుండి ఐదు శాతం జంప్ చేశాయి. సన్ ఫార్మా, సిప్లా, జీ, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, ఐటీసీ, మారుతీ, ఎల్ అండ్ టీ, హిండాల్కో 4% నుండి 0.8% మధ్య బలహీనపడ్డాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications