ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. నేడు (ఫిబ్రవరి 11, గురు వారం) ఉదయం 200 పాయింట్లకు పైగా లాభపడి ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత దాదాపు నిన్నటి స్థాయికి పడిపోయాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. ఉదయం లాభాల కంటే మించి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 51,500 పాయింట్లను క్రాస్ చేసింది. సూచీలు ఎప్పటికప్పుడు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. నిఫ్టీ 15,200 సమీపానికి చేరుకుంది. నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ పీఎస్‌యు బ్యాంకు నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్ 222 పాయింట్లు జంప్
సెన్సెక్స్ నేడు 222.13 పాయింట్లు లేదా 0.43% లాభపడి 51,531.52 పాయింట్ల వద్ద, నిఫ్టీ 66.80 పాయింట్లు లేదా 0.44% లాభపడి 15,173.30 వద్ద క్లోజ్ అయింది. 1711 షేర్లు లాభాల్లో, 1229 షేర్లు నష్టాల్లో ముగియగా, 133 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 72.86 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 72.71 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 72.84 వద్ద క్లోజ్ అయింది. నేటి సెషన్లో 72.65-72.87 మధ్య ట్రేడ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో 5.73 శాతం, రిలయన్స్ 4.12 శాతం, సన్ ఫార్మా 2.64 శాతం, అదానీ పోర్ట్స్ 2.60 శాతం, గెయిల్ 2.13 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 2.87 శాతం, ఎన్టీపీసీ 2.55 శాతం, టైటాన్ కంపెనీ 2.46 శాతం, లార్సన్ 1.44 శాతం, టాటా మోటార్స్ 1.19 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, టాటా మోటార్స్, ఎస్బీఐ, హిండాల్కో, ఐచర్ మోటార్స్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు ఏకంగా 4.43 శాతం లాభపడి రూ.2,062 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.44 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.13 శాతం లాభపడ్డాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.55 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.35 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.81 శాతం, నిఫ్టీ ఐటీ 0.61 శాతం, నిఫ్టీ మెటల్ 1.02 శాతం, నిఫ్టీ ఫార్మా 0.19 శాతం లాభపడ్డాయి.నిఫ్టీ బ్యాంకు 0.09 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.04 శాతం, నిఫ్టీ మీడియా 0.24 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.25 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.26 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.08 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

Stock market: మార్కెట్ నష్టాల్లో కూడా లాభాల్లో ఉన్న ఏకైక రంగం ఇదే.. మీరు ఈ షేర్లు కొన్నారా?

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications