Market today: దెబ్బతీసిన పవర్, ఫార్మా స్టాక్స్, నిలబెట్టిన ఐటీ, చమురు
వరుస నాలుగు రోజుల నష్టానికి బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్ భారీగా లాభపడగా, పవర్, పార్మా రంగాలు కిందకు లాగాయి. దీంతో మార్కెట్లు స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. ఉదయం నుంటి మార్కెట్లు ఊగిసలాటలో ఉన్నాయి. మధ్యలో రెండుమూడుసార్లు నష్టాల్లోకి వెళ్లినప్పటికీ తిరిగి కోలుకున్నాయి. సెన్సెక్స్ నేడు దాదాపు 700 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. ఉదయం 58,000 పాయింట్లను క్రాస్ చేసినప్పటికీ, చివరలో ఈ మార్కు దిగువనే ముగిసింది. సెన్సెక్స్ 0.20 శాతం, నిఫ్టీ 0.16 శాతం మేర లాభపడ్డాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు మినహా మిగతా స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5శాతం చొప్పున నష్టపోయాయి.

భారీ లాభాల నుండి నష్టాల్లోకి వెళ్లి..
స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాల్లో ముగిశాయి. అయితే అమెరికా ఫెడ్ రిజర్వ్ పరపతి సానుకూల నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి. ఇది భారత మార్కెట్ పైన ప్రభావం చూపింది. అయితే వివిధ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు ఒత్తిడిలో కనిపించాయి. చివరకు మాత్రం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు నేడు ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఓ సమయంలో 500 పాయింట్లకు పైగా లాభపడింది. కానీ ఫార్మా, పవర్ సెక్టార్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో కాసేపు నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్ల భారీ లాభాలతో సానుకూలంగా ముగిశాయి.

స్వల్ప లాభాల్లో ముగింపు
సెన్సెక్స్ నేడు 58,243.43 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,337.20 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,683.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,373.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,379.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,184.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 113.11 (0.20%) పాయింట్లు లాభపడి 57,901.14 పాయింట్ల వద్ద, నిఫ్టీ 27.00 (0.16%) పాయింట్లు ఎగిసి 17,248.40 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ స్టాక్స్ నష్టాల్లో..
స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అయితే పలు స్టాక్స్ మాత్రం నష్టపోయాయి. భారతీయ ఇంట్ఎన్ఎల్ (down 14.24 per cent), చంద్రిమా మెర్కంటైల్ (down 13.06 per cent), BN రాథీ సెక్ (down 10.49 per cent), రెలిక్ టెక్న్ (down 10.00 per cent), సాగర్ డైమండ్స్ (down 10.00 per cent) నష్టపోయాయి.


Click it and Unblock the Notifications