రికార్డ్ గరిష్టాన్ని తాకి, చివరకు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: ఆటో, ఐటీ పతనం
స్టాక్ మార్కెట్లు నేడు (మంగళవారం, జూలై 6) లాభాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం రికార్డ్ గరిష్టాన్ని తాకి, చివరి అరగంటలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ నేడు ఎక్కువగా 53,000 పాయింట్లకు పైనే కదలాడింది. చివరి గంటలో ఈ మార్కు దిగువకు వచ్చి, ఆ తర్వాత కాసేపటికి నష్టాల్లోకి వెళ్లింది. నిఫ్టీ కూడా ఉదయం నుండి లాభాల్లోనే ట్రేడ్ అయి చివరకు 16 పాయింట్ల నష్టంతో ముగిసింది.
సెన్సెక్స్ 52,874.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,129.37 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,804.18 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,813.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,914.20 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,801.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్, శ్రీసిమెంట్స్, HDFC బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్, గ్లాండ్, టెక్ మహీంద్రా, టీసీఎస్, కోల్ ఇండియా ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంకు, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.
ఆటో, ఐటీ, పీఎస్‌యు బ్యాంకింగ్ రంగాలు సూచీలను కిందకు పడేశాయి. నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు, నిఫ్టీ రియాల్టీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు లాభాల్లో ముగిశాయి.


Click it and Unblock the Notifications