భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (మార్చి 9) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు, నిఫ్టీ 142 పాయింట్ల వరకు ఎగిసింది. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటంతో మన మార్కెట్లపై ఈ ప్రభావం పడింది. అయితే సూచీలు మరోసారి పడిపోయే అవకాశాలు కొట్టి పారేయలేమని, నిఫ్టీ 15,280 పాయింట్లు, సెన్సెక్స్ 51,540 పాయింట్ల వద్దకు చేరే వరకు మరో ఫాల్ కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మంగళవారం సెన్సెక్స్ 50,150/50,200, నిఫ్టీ 14,860/14,890 మధ్య మద్దతు కనిపించింది.

600 పాయింట్లు జంప్
సెన్సెక్స్ ఉదయం 50,714.16 వద్ద ప్రారంభమై, 51,111.94 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,396.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన, మధ్యాహ్నం సమయానికి స్థిరంగా కనిపించింది. తిరిగి పుంజుకొని, 584 పాయింట్ల లాభంలో ముగిసింది. సెన్సెక్స్ 584.41 పాయింట్లు ఎగిసి 51,025 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 142.20 పాయింట్లు లాభపడి 15,098 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్ లాస్ట్ గంటలో రికవరీ అయింది. దీంతో ఆల్ టైమ్ గరిష్టం సమీపానికి చేరుకుంది.

టాప్ గెయినర్స్, లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 5.14 శాతం, కొటక్ మహీంద్రా 3.29 శాతం, HDFC బ్యాంకు 2.83 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 2.80 శాతం, HDFC 2.67 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో BPCL 4.46 శాతం, టాటా స్టీల్ 4.14 శాతం, గెయిల్ 3.31 శాతం, ఐవోసీ 2.94 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.89 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బీపీసీఎల్, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.
నిఫ్టీ 50 స్టాక్స్ 0.07 శాతం నష్టపోయింది.

ఆ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోయాయి. దీంతో డాలర్ మారకంతో రూపాయి విలువ బలపడడం సూచీల్లో ఉత్సాహం నింపింది. ఇక ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ముగిశాయి. జపాన్ సూచీ నిక్కీ 1 శాతం, ఆస్ట్రేలియా సూచీ 0.5 శాతం, దక్షిణ కొరియా సూచీ కోస్పీ 0.7 శాతం, హాంగ్‌కాంగ్ సూచీ హాంగ్ సెంగ్ 0.8 శాతం లాభపడ్డాయి. షాంగై కాంపోజిట్ మాత్రం 1.8 శాతం నష్టపోయింది.


Click it and Unblock the Notifications