ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జూన్ 2) భారీ నష్టాల్లో ప్రారంభమై, రోజంతా నష్టాల్లోనే కదలాడి, చివరకు కాస్త కోలుకున్నప్పటికీ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఓ సమయంలో దాదాపు 500 పాయింట్ల మేర నష్టపోయింది. కనీసం ఒక్కసారి కూడా నిన్నటిస్థాయికి రాలేదు. అగ్ర రాజ్యం అమెరికాలో తయారీ రంగం పుంజుకొన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దీంతో డౌజోన్స్ లాభాల్లో ముగిసింది. అలాగే, నిన్న సాయంత్రం, నేడు ప్రారంభంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. దీంతో భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి.

భారీ నష్టాల నుండి కోలుకొని...
సెన్సెక్స్ నేడు ఉదయం 51,749.10 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,913.92 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,450.58 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 85.40 (0.16%) పాయింట్లు నష్టపోయి 51,849.48 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,520.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,597.45 వద్ద గరిష్టాన్ని, 15,459.85 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 1.35 (0.0087%) పాయింట్లు ఎగిసి 15,576.20 పాయింట్ల వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో యూపీఎల్ 2.67 శాతం, టాటా స్టీల్ 2.10 శాతం, SBI లైఫ్ ఇన్సురెన్స్ 1.87 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 1.78 శాతం, అదానీ పోర్ట్స్ 1.67 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ 2.90 శాతం, టెక్ మహీంద్రా 1.31 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.09 శాతం, ఏషియన్ పేయింట్స్ 0.93 శాతం, కొటక్ మహీంద్రా 0.77 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, SBI, టాటా స్టీల్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.01 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.62 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో 1.82 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.10 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.23 శాతం, నిఫ్టీ మీడియా 0.20 శాతం, నిఫ్టీ మెటల్ 2.18 శాతం, నిఫ్టీ ఫార్మా 0.67 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.03 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.45 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.12 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.15 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.52 శాతం, నిఫ్టీ ఐటీ 0.75 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications