ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలు, కరోనా కేసులు తగ్గడం వంటి వివిధ సానుకూల అంశాల నేపథ్యంలో ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నప్పటికీ మొత్తానికి ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ 52,వేల దిగువనే ఉంది. నిఫ్టీ 15,575 పాయింట్లకు దిగువన ఉంది. సూచీలు రోజంతా భారీ ఊగిసలాటలో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.90గా ఉంది.

లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నష్టాల్లోకి...
సెన్సెక్స్ నేడు ఉదయం 52,067.51 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,228.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,808.88 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 2.56 (0.0049%) పాయింట్లు క్షీణించి 51,934.88 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 15,629.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,660.75 వద్ద గరిష్టాన్ని, 15,528.30 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 7.95 (0.51%) పాయింట్లు నష్టపోయి 15,574.85 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ చాన్నాళ్లకు 52వేల పాయింట్లు దాటింది. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ongc 3.52 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.93 శాతం, SBI 1.97 శాతం, HDFC 1.01 శాతం, బజాజ్ ఆటో 0.97 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ICICI బ్యాంకు 1.80 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 1.63 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.51 శాతం, యాక్సిస్ బ్యాంకు 0.69 శాతం, ఐటీసీ 0.65 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఎస్బీఐ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.05 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.58 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎనర్జీ 0.34 శాతం, నిఫ్టీ ఐటీ 0.11 శాతం, నిఫ్టీ మీడియా 0.32 శాతం, నిఫ్టీ ఫార్మా 0.04 శాతం, లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.58 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.53 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.11 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.01 శాతం, నిఫ్టీ మెటల్ 0.78 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.57 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.52 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.93 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications