ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (డిసెంబర్ 18) స్వల్పలాభాల్లో ముగిశాయి. ఓ సమయంలో 47,000 మార్కుకు చేరుకున్న సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం చివరి గంటలో మళ్లీ పుంజుకొని 47,000 కొత్త రికార్డుకు 40 పాయింట్ల దూరంలో క్లోజ్ అయింది. నిఫ్టీ 13,800 సమీపానికి చేరింది. వచ్చే వారం సెన్సెక్స్ 47,000, నిఫ్టీ 13,800ను క్రాస్ చేసే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ, ఫార్మా రంగాలు నేడు ఒక్కో శాతం చొప్పున లాభపడగా, బ్యాంకింగ్, మెటల్, ఇన్ఫ్రా, ఎనర్జీ రంగాలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

47000కు సమీపంలో సెన్సెక్స్
సెన్సెక్స్ 70.35 పాయింట్లు (0.15%) లాభపడి 46,960.69 పాయింట్ల వద్ద, నిఫ్టీ 19.80 పాయింట్లు (0.14%) ఎగిసి 13,760.50 పాయింట్ల వద్ద ముగిసింది. 1125 షేర్లు లాభాల్లో, 1611 షేర్లు నష్టాల్లో ముగియగా, 122 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 73.57 వద్ద ఫ్లాట్‌గా క్లోజ్ అయింది. ఉదయం 73.54 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 73.58 వద్ద ముగిసింది. నేడు 73.49-73.57 మధ్య కదలాడింది.
రిలయన్స్ షేర్ నేడు స్వల్పంగా 0.63 శాతం లాభడి రూ.1998 వద్ద ముగిసింది. ఈ స్టాక్ నెల రోజులుగా దాదాపు రూ.2,000కు దిగువనే ఉంది. ఒకటి రెండు పర్యాయాలు అలా పైకి చేరి, మళ్లీ 2000 మార్కు దిగువకు వస్తోంది.

టాప్ గెయినర్స్, లూజర్స్
ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన కాసేపటికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురవడంతో నష్టాల్లోకి వెళ్లింది. ఓ సమయంలో 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. మధ్యాహ్నం సెషన్‌లో కోలుకొని స్వల్ప లాభాలతో ముగిసింది.
నేడు టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.07 శాతం, ఇన్ఫోసిస్ 2.64 శాతం, బజాజ్ ఆటో 2.36 శాతం, విప్రో 1.86 శాతం, హిండాల్కో 1.65 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 3.27 శాతం, ONGC 2.46 శాతం, HDFC బ్యాంకు 2.11 శాతం, మారుతీ సుజుకీ 1.74 శాతం, IOC 1.52 నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఆటో, రిలయన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నేడు కనిష్టం నుండి సెన్సెక్స్ 330 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు ఎగిసింది. మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంకును HDFC 212 పాయింట్లు కిందకు పడవేయగా, ఐసీఐసీఐ బ్యాంకు 112 పాయింట్లు పైకి లేపింది. బర్గర్ కింగ్ రెండో రోజు లోయర్ సర్క్యూట్ వద్ద ముగిసింది.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.18 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.43 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.53 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.56 శాతం, నిఫ్టీ మీడియా 0.12 శాతం, నిఫ్టీ మెటల్ 0.34 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.71 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.61 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.74 శాతం నష్టపోయాయి.
నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.26 శాతం, నిఫ్టీ ఐటీ 1.59 శాతం, నిఫ్టీ ఫార్మా 1.27 శాతం లాభాల్లో ముగిశాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications