భారీ లాభాలు ఆవిరి: నష్టపోయిన టాప్ 5 కంపెనీల్లో 3 ఫార్మావే, ఒత్తిడిలో విప్రో

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం(అక్టోబర్ 13) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం భారీ లాభాలను చూసిన మార్కెట్లు, మధ్యాహ్నానికి అమ్మకాలు వెల్లువెత్తడంతో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. నిన్న కూడా ప్రారంభంలో మంచి లాభాలు చూసినప్పటికీ, చివరకు స్వల్ప లాభాల్లో క్లోజ్ అయ్యాయి. నేడు కూడా అదే ఒరవడి కొనసాగింది. అయితే మొత్తానికి వరుసగా 9వ రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 31.71 పాయింట్లు(0.08%) లాభపడి 40,625.51 పాయింట్ల వద్ద, నిఫ్టీ 3.50 పాయింట్లు(0.03%) లాభపడి 11,934.50 వద్ద ముగిసింది. 1,129 షేర్లు లాభాల్లో, 1,459 షేర్లు నష్టాల్లో ముగియగా, 177 స్టాక్స్‌లో ఎలాంటి మార్పులేదు.

ఆటో, బ్యాంకింగ్, ఫార్మా నష్టాల్లో..

ఆటో, బ్యాంకింగ్, ఫార్మా నష్టాల్లో..

నిఫ్టీ ఫార్మా భారీ నష్టాల్లో ముగిసింది. 1.68 శాతం మేర పడిపోయింది. లుపిన్ ఒక్కటే 0.91 శాతం లాభాల్లో ముగిసింది. డాక్టర్ రెడ్డీస్, టోరెంట్ ఫార్మా, ఆల్కెమ్, దివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, బయోకాన్, అరబిందో ఫార్మా, సిప్లా స్టాక్స్ 0.78 శాతం నుండి 3.15 శాతం మేర నష్టపోయాయి.

ఎనర్జీ, ఐటీ, మెటల్, రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల్లో అమ్మకాలు పెరిగాయి. నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా 9వ రోజు లాభాల్లో ముగిశాయి.

నిఫ్టీ బ్యాంకు ఒక శాతం నష్టపోయింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ స్టాక్స్ మార్కెట్లను కిందకు లాగాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్ర బ్యాంకు మార్కెట్లను పైకి లేపాయి.

ఫార్మా డౌన్

ఫార్మా డౌన్

నిఫ్టీ బ్యాంకు 221 పాయింట్లు నష్టపోయి 23,492 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ సూచీ 82 పాయింట్లు కోల్పోయి 16,913 వద్ద క్లోజ్ అయింది.

అన్నింటి కంటే ఎక్కువగా ఫార్మా రంగాలు నష్టపోయాయి. సిప్లా, కాడిలా టాప్ లూజర్స్‌గా నిలిచాయి.

సిమెంట్ స్టాక్స్ లాభాలు నమోదు చేశాయి. అల్ట్రా టెక్ సిమెంట్ టాప్ గెయినర్‌గా నిలిచింది.

నిఫ్టీ టాప్ గెయినర్‌గా హెచ్‌సీఎల్ టెక్ నిలిచింది. ఇన్ఫోసిస్ రెండు శాతం లాభపడింది.

జియో టెలికం సబ్‌‍స్క్రైబర్లు 40 కోట్లకు చేరుకున్నారు. జియోకు కస్టమర్లు పెరుగుతుండటంతో రిలయన్స్ స్టాక్స్ 2 శాతం పెరిగాయి.

జేబీ కెమికల్స్, కోఫోర్జ్, రెయిన్ ఇండస్ట్రీస్, కుమ్మిన్స్, టాప్ మిడ్ క్యాప్ గెయినర్స్.

ఐదు టాప్ లూజర్లలో 3 ఫార్మావే

ఐదు టాప్ లూజర్లలో 3 ఫార్మావే

టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్‌సీఎల్ టెక్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఇన్ఫోసిస్, రిలయన్స్, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా, టైటాన్, అదానీ పోర్ట్స్, దివిస్ ల్యాబ్స్, సన్ ఫార్మా ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో ఐదింట మూడు స్టాక్స్ ఫార్మా రంగానివే కావడం గమనార్హం.

ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 0.018 శాతం, HCL టెక్ షేర్ 4.05 శాతం, ఇన్ఫోసిస్ 2.46 శాతం, టెక్ మహీంద్ర 0.82 శాతం, కోఫోర్జ్ షేర్ ధర 4.43 శాతం లాభపడింది. సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో విప్రో షేర్ ఒత్తిడికి లోనై 0.61 శాతం నష్టపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+