భారీ లాభాల నుండి భారీ నష్టాల్లోకి.. చివరకు ఫ్లాట్‌గా: 700 పాయింట్లు అప్-డౌన్

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (జనవరి 13) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటి తర్వాత క్రమంగా కిందకు పడిపోయాయి. ఉదయం భారీ లాభాల నుండి మధ్యాహ్నం గం.11.30 వరకు అతి స్వల్ప లాభాల్లోకి పడిపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత తీవ్ర నష్టాల్లోకి వెళ్ళింది. ఓ దశలో 49,073 పాయింట్లకు పడిపోయింది. ఫార్మా, రియాల్టీ, ఫైనాన్షియల్ స్టాక్స్ రంగం మినహాయించి దాదాపు అన్ని కూడా నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వరుసగా 0.6 శాతం, 0.4 శాతం మేర నష్టపోయాయి.

ప్రారంభం అదుర్స్, మధ్యలో పతనం, చివరకు ఫ్లాట్

ప్రారంభం అదుర్స్, మధ్యలో పతనం, చివరకు ఫ్లాట్

సెన్సెక్స్ 24.79 పాయింట్లు లేదా 0.05% క్షీణించి 49492.32 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1.40 పాయింట్లు లేదా 0.01% క్షీణించి 14564.90 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1200 షేర్లు లాభాల్లో, 1807 షేర్లు నష్టాల్లో ముగియగా, 143 షేర్లలో ఎలాంటి మార్పులేదు.

సెన్సెక్స్ నేడు 49,795 పాయింట్లను క్రాస్ చేసి, 49800 దిశగా కనిపించింది. త్వరలోనే 50వేల పాయింట్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి గరిష్టం 49795 కాగా, కనిష్టం 49,073. అంటే నేటి గరిష్టం నుండి సెన్సెక్స్ 700 పాయింట్లు పడిపోయింది. చివరకు నేటి కనిష్టం నుండి 420 పాయింట్లు లాభపడింది.

రూపాయి 15 పైసలు బలపడి 73.15 వద్ద క్లోజ్ అయింది. నిన్న 73.25 వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 6.22 శాతం, అదానీ పోర్ట్స్ 4.97 శాతం, SBI 4.89 శాతం, IOC 3.06 శాతం, NTPC 2.40 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో HDFC 2.79 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.76 శాతం, శ్రీ సిమెంట్స్ 2.53 శాతం, UPL 1.95 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.85 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, రిలయన్స్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు 1.08 శాతం పడిపోయి 1936 వద్ద క్లోజ్ అయింది.

రంగాలవారీగా

రంగాలవారీగా

నిఫ్టీ 50 స్టాక్స్ 1.40 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.66 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.88 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.73 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.58 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.37 శాతం, నిఫ్టీ ఐటీ 0.08 శాతం, నిఫ్టీ మీడియా 0.32 శాతం, నిఫ్టీ మెటల్ 0.38 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.27 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.11 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.56 శాతం, నిఫ్టీ ఫార్మా 0.92 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.31 శాతం నష్టపోయాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+