భారీ లాభాల నుండి నష్టాల్లోకి..: కిందకు లాగిన బ్యాంకింగ్, అందుకే నష్టాల్లోకి..
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (సెప్టెంబర్ 29) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్లు అటు తర్వాత ఆద్యంతం ఊగిసలాటలో కనిపించాయి. సెన్సెక్స్ 8.41 పాయింట్లు (0.02%) శాతం నష్టపోయి 37,973.22 వద్ద, నిఫ్టీ 5.10 పాయింట్లు(0.05%) క్షీణించి 11,222.40 పాయింట్ల వద్ద ముగిసింది. 1170 షేర్లు లాభాల్లో, 1406 షేర్లు నష్టాల్లో ముగియగా, 168 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
సెన్సెక్స్ డే-హై నుండి దాదాపు 300 పాయింట్ల మేర పడిపోయింది. ఓ సమయంలో సెన్సెక్స్ 38,236 గరిష్టం వద్ద, 37,831.35 కనిష్టం వద్ద ట్రేడ్ అయింది. చివరకు 37,973.22 వద్ద ముగిసింది. మెటల్, ఐటీ, ఆటో రంగాల్లో భారీగా కొనుగోళ్లు కనిపించాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఫార్మా, ఎనర్జీ రంగాలు నష్టాల్లో ముగిశాయి.

కిందకు లాగిన బ్యాంకింగ్
- లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
- ఐటీసీ, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్ వంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్‌ను కిందకు లాగాయి.
- రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ వంటి దిగ్గజాలు మార్కెట్‌ను ముందుకు తీసుకు వెళ్లాయి.
- నష్టపోయిన రంగాల్లో నిఫ్టీ బ్యాంక్ ఎక్కువగా కిందకు లాగింది. ఏకంగా 254 పాయింట్ల నష్టంతో ముగిసింది.
- HDFC బ్యాంకు మినహాయించి, మిగతా నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు 2.60 శాతం నుండి 1.60 శాతం మధ్య క్షీణించాయి.
- మెటల్ స్టాక్స్ లాభపడ్డాయి. హిండాల్కో,టాటా స్టీల్ మంచి లాభాలు చూశాయి.
- హార్లే డేవిడ్సన్‌తో చర్చల నేపథ్యంలో హీరో మోటో కార్ప్ వరుసగా మూడో రోజు లాభాలు చూసింది.
- వొడాఫోన్ ఐడియా షేర్ దాదాపు 6 శాతం మేర క్షీణించింది.
- సియట్, జేఎస్పీఎల్, పేజ్ ఇండస్ట్రీస్, మైండ్‌ట్రీ టాప్ మిడ్ క్యాప్ గెయినర్స్.

టాప్ గెయినర్స్.. టాప్ లూజర్స్
- టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, అల్ట్రా టెక్ సిమెంట్, హీరో మోటో కార్ప్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టీసీఎస్ ఉన్నాయి.
- టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్జీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, యూపీఎల్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.
- సెన్సెక్స్ 30 లో 20 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
- అల్ట్రా టెక్ సిమెంట్, టీసీఎస్, టాటా స్టీల్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్, మారుతీ, ఇన్ఫోసిస్ మాత్రమే లాభాల్లో ముగిశాయి.
- వ్యాల్యూమ్ పరంగా టాపర్స్‌గా రిలయన్స్, బజాజ్ ఫిన్, టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.

ఐటీ షేర్లు మిశ్రమంగా..
- టీసీఎస్ 2.50 శాతం, ఇన్ఫోసిస్ 0.34 శాతం, విప్రో 0.14 శాతం, మైండ్ ట్రీ 3.81 శాతం లాభపడగా, హెచ్‌సీఎల్ టెక్ 2.38 శాతం, టెక్ మహీంద్ర 1.87 శాతం, కోఫోర్జీ 2.28 శాతం మేర నష్టపోయాయి. ఐటీ స్టాక్స్ మిశ్రమంగా ఉన్నాయి.
- వొడాఫోన్ ఐడియా, బీహెచ్‌ఈఎల్ షేర్లు 5 శాతం మేర నష్టపోయాయి.
- మెటల్ ఇండెక్స్, రిలయన్స్, టీసీఎస్ వంటి దిగ్గజాలు మార్కెట్‌కు ఉపకరించగా, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు కిందకు లాగాయి.
- ఉదయం స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా కదిలాయి. దేశీయంగా ఆర్థిక పునరుద్ధరణకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టవచ్చుననే సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెటును బలపరిచాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి వెళ్లాయి.


Click it and Unblock the Notifications