ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఫిబ్రవరి 23) ఫ్లాట్‌గా ముగిశాయి. నిన్నటి వరకు మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. నేడు ఆ నష్టాలకు చెక్ పడింది. మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి నుండి తేరుకొంది. ప్రాఫిట్ బుకింగ్ ముగిసినట్లుగా కనిపిస్తోంది. దీనికి తోడు కీలక రంగాల మద్దతు లభించడంతో సూచీలు ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం నుండి స్వల్ప లాభాల్లోకి వచ్చిన సూచీలు, ఆ తర్వాత ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ నేడు కూడా 50,000 పాయింట్ల దిగువనే నిలిచింది. ఆ కాస్త సానుకూలం మెటల్ స్టాక్స్ వల్ల వచ్చింది.

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ నేడు 7.09 పాయింట్లు లేదా 0.01% లాభపడి 49,751.41 పాయింట్ల వద్ద, నిఫ్టీ 32.10 పాయింట్లు లేదా 0.22% లాభపడి 14,707.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1657 షేర్లు లాభాల్లో, 1213 షేర్లు నష్టాల్లో ముగియగా, 158 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ ఉదయం 49,994.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 50,327.31 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 49,659.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. డాలర్ మారకంతో రూపాయి 72.46 వద్ద క్లోజ్ అయింది. నేడు రూపాయి 4 పైసలు బలపడింది. క్రితం సెషన్లో 72.50 వద్ద ముగిసింది. నేటి సెషన్లో 72.30-72.47 వద్ద క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 6.54 శాతం, టాటా మోటార్స్ 6.40 శాతం, ONGC 5.55 శాతం, హిండాల్కో 5.36 శాతం, యూపీఎల్ 4.94 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా 3.93 శాతం, అదానీ పోర్ట్స్ 1.75 శాతం, మారుతీ సుజుకీ 1.64 శాతం, బజాజ్ ఆటో 1.49 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.38 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, టాటా స్టీల్, రిలయన్స్, ఎస్బీఐ, హిండాల్కో ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ధర నేడు దాదాపు 1 శాతం లాభపడి రూ.2,026 వద్ద ముగిసింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 సూచీ 0.22 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.46 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.77 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.08 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.41 శాతం, నిఫ్టీ ఐటీ 0.17 శాతం, నిఫ్టీ మీడియా 0.15 శాతం, నిఫ్టీ మెటల్ 3.89 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.70 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ బ్యాంకు 0.40 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.51 శాతం, నిఫ్టీ ఫార్మా 0.02 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.14 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.47 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications