ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ అదుర్స్: లాభాలను అడ్డుకున్న ఆటో, టెలికం, మెటల్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఫిబ్రవరి 12) మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 12.78 పాయింట్లు లేదా 0.02% లాభపడి 51,544.30 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు లేదా 0.07% క్షీణించి 15,163.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1400 షేర్లు లాభాల్లో, 1520 షేర్లు నష్టాల్లో ముగియగా, 159 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 11 పైసలు ఎగిసి 72.75 వద్ద క్లోజ్ అయింది. 72.81 వద్ద ప్రారంభమైన రూపాయి, నేటి సెషన్లో 72.73-72.83 మధ్య కదలాడింది. నిన్న 72.86 వద్ద క్లోజ్ అయింది.

టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 4.18 శాతం, ICICI బ్యాంకు 2.69 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.39 శాతం, ఇన్ఫోసిస్ 1.33 శాతం, విప్రో 1.14 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ITC 3.97 శాతం, గెయిల్ 2.60 శాతం, సన్ ఫార్మా 2.56 శాతం, ఓఎన్జీసీ 2.46 శాతం, కోల్ ఇండియా 2.41 శాతం ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, ఐటీసీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.07 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.29 శాతం నష్టాల్లో ముగిశాయి.
రంగాలవారీగా చూస్తే నిఫ్టీ బ్యాంకు 1.00 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.92 శాతం, నిఫ్టీ ఐటీ 0.19 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.26 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.01 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.96 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ ఆటో 0.48 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.07 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.55 శాతం, నిఫ్టీ మీడియా 0.96 శాతం, నిఫ్టీ మెటల్ 1.70 శాతం, నిఫ్టీ ఫార్మా 1.11 శాతం నష్టపోయాయి.

లాభాలకు అడ్డుకట్ట
ఈవారం మొత్తంలో సెన్సెక్స్, నిఫ్టీ, నిఫ్టీ బ్యాంకు 1 శాతం మేర లాభపడ్డాయి. మిడ్ క్యాప్ సూచీలు 2 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ, రియాల్టీ రంగాలు ఈ వారం 3 శాతం చొప్పున లాభపడ్డాయి. సన్ ఫార్మాలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. నేడు ఇది 2.35 శాతం మేర క్షీణించింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. అయితే ఆటో, ఇన్ఫ్రా, టెలికాం, మెటల్ షేర్లు లాభాలను నిలువరించాయి.


Click it and Unblock the Notifications