గత కొద్ది రోజులుగా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు గురువారం (జూన్ 6వ తేదీ) నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం నష్టాల్లోనే ప్రారంభమై, చివరకు సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2 శాతం నష్టాలతో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా నష్టంతో, నిఫ్టీ 50 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 709 పాయింట్లు నష్టపోయి 33,538 పాయింట్ల వద్ద, నిఫ్టీ 214 పాయింట్లు నష్టపోయి 9,902 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

ప్రపంచ మార్కెట్లు, ఫెడ్ అంచనాలు
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా క్షీణించనుందని వివిద ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఈ ప్రభావంతో పాటు అమెరికా జీడీపీ 6.5 శాతం క్షీణిస్తుందని ఫెడ్ అంచనాలు గురువారం దేశీయ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లడానికి కారణమయ్యాయి. ఆర్థిక వ్యవస్థకు మద్దతిస్తామని అమెరికా ఫెడ్ పాలసీలో భాగంగా హామీ ఇచ్చినప్పటికీ స్టాక్స్ నష్టాల్లోకి వెళ్లాయి.
దీంతో పాటు ఏజీఆర్ బకాయిలకు సంబంధించి స్వీయ మదింపు చేసుకోవడంపై విచారణను సుప్రీం కోర్టు జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ ప్రభావం కూడా ఉంది. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా సహా ఇతర టెలికం సంస్థలు బకాయిల చెల్లింపుకు సంబంధించి రోడ్ మ్యాప్ తయారు చేసుకునేందుకు అవకాశమివ్వాలని అఫిడవిట్ దాఖలు చేయగా సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

గత మూడు వారాల్లో భారీ పతనం
గత కొద్ది రోజులుగా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. అంతకుముందు కూడా నష్టాల్లో ఉన్నప్పటికీ స్వల్పంగా మాత్రమే ఉన్నాయి. కానీ వివిధ కారణాలతో ఈ రోజు ఏకంగా 700 పాయింట్లకు పైగా కుప్పకూలింది సెన్సెక్స్. దాదాపు గత నెల రోజుల్లో మార్కెట్లు ఇంతలా కుప్పకూలడం ఇది మొదటిసారి. ఈ రోజు మార్కెట్లు వారం కనిష్టానికి చేరుకున్నాయి.

దెబ్బతీసిన స్టాక్స్
సెన్సెక్స్, నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ 2 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం నష్టపోయింది. దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లోకి వెళ్లాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ స్టాక్స్ భారీగా దెబ్బతీశాయి. 44 నిఫ్టీ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు మాత్రం వరుసగా ఐదో రోజు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచింది.


Click it and Unblock the Notifications