Sensex Crash: పగిలిన స్మాల్ క్యాప్ బబుల్.. సెన్సెక్-నిఫ్టీ క్రాష్.. రూ.14 లక్షల కోట్లు ఆవిరి..
Market Crash: మార్చి నెలలో అత్యంత గడ్డు పరిస్థితులను దేశీయ స్టాక్ మార్కెట్లు చూస్తున్నాయి. వాస్తవానికి నేడు నిఫ్టీ 22,000 పాయింట్ల మార్కుకు కింద ముగియగా.. సెన్సెక్స్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీ భారీ కుదుపుకు గురయ్యాయి. దీంతో అన్ని రంగాలు నేడు నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 906 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 338 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 301 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 2115 పాయింట్లను కోల్పోయాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీ 797 పాయింట్లను కోల్పోయింది. వాస్తవానికి విశ్లేషకులు ప్రస్తుత కరెక్షన్ ఓవర్ వాల్యూ పలికిన స్మాల్-మిడ్ క్యాప్ బబుల్ పగలటంగా భావిస్తున్నారు. కోట్ల మెంది పెట్టుబడిదారుల సంపద నేడు దీంతో లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది.

మార్కెట్లు కుప్పకూలటంతో ఇన్వెస్టర్లు త్వరగా స్టాక్ మార్కెట్ క్లోజింగ్ వస్తే బాగుంటుందని భావిస్తున్న మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1000 పాయింట్ల మేర మార్కెట్లు పతనం కావటంతో ఇన్వెస్టర్లు ఇలా అయితే బతకటం కష్టంగా భావిస్తూ తమ సంపదను కోల్పోవటంపై ఆందోళన చెందుతున్నారన్న మీమ్ వైరల్ అవుతోంది.
నేడు మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో కేవలం ఐటీసీ, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications