Sensex Crash: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం మెుదలుపెట్టగానే ఊపందున్న మార్కెట్లు తర్వాత ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ ఇంట్రాడేలో 700 పాయింట్ల లాభం ఆవిరై దాదాపు 1000 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ సైతం భారీగా క్షీణతను నమోదు చేసింది.
వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మోదీ 3.0 బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రేట్లను పెంచటం ఇన్వెస్టర్లను భారీగా నిరాశకు గురిచేసింది. లాంట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రేటును 12.5 శాతానికి పెంచగా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రేటును 20 శాతానికి పెంచటం అందరినీ నిరాశకు గురిచేసింది. ఇదే క్రమంలో మోదీ సర్కార్ ఈ సారి మౌలిక సదుపాయాలపై ఖర్చుకు ఎలాంటి కొత్త ప్రకటన లేకపోవటం ఈ రంగంలోని కంపెనీలను నిరాశకు గురిచేసింది. అయితే వ్యవసాయంలో కొత్త వంగడాలపై దృష్టికి ప్రాధాన్యత అందించటం ఆ రంగంలోని సీడ్స్ తయారీ సంస్థల షేర్ల పెరుగుదలకు దారితీసింది.

మధ్యాహ్నం 1.46 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 570 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 180 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. అయితే ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై సుంకం తగ్గింపు వల్ల జ్యూవెలరీ రంగంలోని స్టాక్స్ ఒక్కసారిగా లాభపడ్డాయి.
జెఫరీస్ చెప్పిందే నిజమైంది:
జెఫరీస్‌లో ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ వుడ్ ఇటీవల దేశీయ స్టాక్ మార్కెట్లు, బడ్జెట్ గురించి కీలక కామెంట్స్ చేశారు. భారతదేశంలో ఈక్విటీ పెట్టుబడుల సంస్కృతిని అభివృద్ధి దశలో ఉన్నందున చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో బీజేపీ ప్రభుత్వం ఈక్విటీలపై మూలధన లాభాల పన్నులో ఏవైనా మార్పులు చోటుచేసుకుంటే.. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలతాయని పేర్కొన్నారు. అది ఎన్నికల ఫలితాల రోజు జరిగిన క్రాష్ కంటే ఘోరంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఆయన అంచనా వేసినట్లుగానే భారత ఈక్విటీ మార్కెట్లలో కరెక్షన్ నమోదైంది.


Click it and Unblock the Notifications