Sensex Fall: దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రస్తుతం త్వరలో ప్రారంభం కానున్న క్యూ3 ఫలితాలతో పాటు హెచ్ఎంపీవీ వైరస్ కేసు బయటపడటం భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో నేడు ఇంట్రాడేలో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు ఒక్కసారిగా పతనాన్ని చూశాయి. అలాగే విక్స్ సూచీ 10 శాతం పెరుగుదలను చూసింది.
మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 898 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో ఇంట్రాడే గరిష్ఠం నుంచి సెన్సెక్స్ 1500 పాయింట్ల మేర తగ్గుదలను నమోదు చేసింది. అలాగే మరో కీలక సూచీ నిఫ్టీ 286 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 926 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1123 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది. దీంతో మార్కెట్లోని అన్ని రంగాలకు చెందిన షేర్లు నేడు నష్టాలతో ఎరుపెక్కాయి. ప్రధానంగా మూడవ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు ఊహించిదాని కంటే తక్కువగా ఉంటాయనే అంచనాల మధ్య ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ స్టాక్స్, కన్జూమర్ స్టాక్స్ పతనాన్ని చూస్తున్నాయి.

ఇదే క్రమంలో మార్కెట్ పతనానికి దారితీసిన ఇతర కారణాలను పరిశీలిస్తే.. ఇన్వెస్టర్లలో కలవాన్ని పెంచిన ప్రధాన కారణం చైనాలో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ తొలి కేసు బెంగళూరు నగరంలో ఒక 8 నెలల చిన్నారిలో గుర్తించబడటం. దీనికి తోడు మరో 3 నెలల చిన్నారిలో కూడా మరో కేసు గుర్తించబడినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. అయితే ఈ రెండు కేసులు బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్ లోనే గుర్తించబడటం గమనార్హం. అయితే ఈ రెండు కేసుల్లోనూ వారికి ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణం చేయలేదని గుర్తించబడింది. అయితే దీనికి ప్రతిస్పందనగా మార్కెట్లు పతనాన్ని చూడటం కేవలం చిన్న కుదుపుగా పరిగాణించాలని వారు సూచిస్తున్నారు.
ఇదే క్రమంలో డాలర్ విలువ బలంగా ఉండటంతో పాటు అధిక వ్యాల్యుయేషన్లు మార్కెట్ల పతనానికి దారితీసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతినిధి వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ రేట్ ఔట్‌లుక్‌పై మరింత స్పష్టత పొందడానికి పెట్టుబడిదారులు ఈ వారం యూఎస్ ఆర్థిక డేటా కోసం ఎదురుచూస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌ల ముప్పు పొంచి ఉన్న క్రమంలో చైనా కరెన్సీ యువాన్ 16 నెలల కనిష్ఠం డాలర్ తో పోల్చితే 7.3ని అతిక్రమించింది. దీనికి తోడు నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో మెటల్, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ స్టాక్స్ భారీగా పతనాన్ని చూశాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications