ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం (డిసెంబర్ 8) లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 52.69 పాయింట్లు (0.12%) లాభపడి 45,479.66 వద్ద, నిఫ్టీ 18.70 పాయింట్లు (0.14%) ఎగిసి 13374.50 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 1144 షేర్లు లాభాల్లో, 251 షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. 44 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 8 పైసలు ఎగిసి రూ.73.82 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు సెషన్‌లో 73.90 వద్ద ముగిసింది.

46వేల దిశగా సెన్సెక్స్, నిఫ్టీ 13,400 వైపు
సూచీలు నేడు మరోసారి సరికొత్త రికార్డును తాకాయి. కరోనా కేసులు తగ్గి, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతుండటం, కంపెనీలు ఆశాజనక ఫలితాలు ప్రకటిస్తుండటంతో సూచీలు గత నెల రోజులుగా కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. నవంబర్ ప్రారంభ వారంలో 42వేల మార్కును తాకిన సెన్సెక్స్ నెల రోజుల్లోనే తిరిగి 45వేలను దాటి, 46వేల మార్కు దిశగా పయనిస్తోంది. ఆటో, ఫైనాన్షియల్ స్టాక్స్ వల్ల నేడు సూచీలు ఎగిశాయి.
ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 283 పాయింట్లు లాభపడి 45,710 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 46,000 దిశగా సాగుతోంది. నిఫ్టీ 13,375 పాయింట్లను తాకింది. 13,400 దిశగా పయనిస్తోంది.

రిలయన్స్ రూ.2000 క్రాస్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో అల్ట్రా టెక్ సిమెంట్ 2.72 శాతం, రిలయన్స్ 2.49 శాతం, HCL టెక్ 2.02 శాతం, యూపీఎల్ 1.92 శాతం, మారుతీ సుజుకీ 1.51 శాతం లాభపడ్డాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో సన్ ఫార్మా 1.43 శాతం, కోల్ ఇండియా 1.39 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.27 శాతం, టెక్ మహీంద్రా 0.99 శాతం, JSW స్టీల్ 0.99 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, మారుతీ సుజుకీ, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 2.55 శాతం పెరిగి రూ.2,008 వద్ద ట్రేడ్ అయింది. చాలా రోజుల తర్వాత రిలయన్స్ స్టాక్ రూ.2000 క్రాస్ చేసింది.

ఏ రంగం ఎంత
నిఫ్టీ 50 స్టాక్స్ 0.51 శాతం, నిప్టీ మిడ్ క్యాప్ సూచీ 0.31 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.30 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.68 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.15 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.17 శాతం, నిఫ్టీ ఐటీ 0.54 శాతం, నిఫ్టీ మీడియా 0.01 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.92 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.01 శాతం లాభపడ్డాయి.
నిఫ్టీ మెటల్ 1.11 శాతం, నిఫ్టీ ఫార్మా 0.55 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.10 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications