Closing Bell: కొత్త వారాన్ని లాభాలతో ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు చివరికి భారీ గెయిన్స్ మధ్య ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో ఐటీ, మెటల్, రియల్టీ రంగాలకు చెందిన షేర్లు భారీగా లాభపడ్డాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 612 పాయింట్ల లాభంతో ఉండగా, మరో కీలక సూచీ నిఫ్టీ 187 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 215 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 376 పాయింట్లు గెయిన్ అయ్యాయి. బలమైన బుల్స్ జోరు తర్వాత నిఫ్టీ సూచీ 25,000 పాయింట్లకు పైన ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో నేడు సెబీ పేటీఎం ఐపీవోకి సంబంధించిన విషయంలో సీఈవో, ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మకు నోటీసులు పంపటంతో స్టాక్ భారీ నష్టాలను చవిచూసింది.

ఎన్ఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నీలజీస్, హిందాల్కొ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, ఎల్‌టిఐఎమ్, టైటాన్, విప్రో, దివీస్ ల్యాబ్, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లా, టాటా స్టీల్, ఎల్ టి, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ, బీపీసీఎల్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ప్రయాణాన్ని పండుగ రోజున ముగించాయి.


Click it and Unblock the Notifications