Stock Market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. Sensex, Nifty సూపర్ ర్యాలీ..
Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు ఆసియా మార్కెట్ల అండతో నేడు మంచి పనితీరును కనబరిచాయి. ఈవారం మెుదట్లో భారీ నష్టాల తర్వాత చివరి రెండు రోజులు మంచి లాభాలను నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 364 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 108 పాయింట్ల లాభాల్లో ముగిసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 147 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 239 పాయింట్ల మేర నేడు లాభపడ్డాయి. ప్రధానంగా ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో రియల్టీ రంగంలోని షేర్లు ఉత్తమమైన పనితీరును కనబరిచాయి. దీనికి తోడు ఆటో, మెటల్, ఐటీ రంగాల షేర్లు సైతం 0.5 శాతం నుంచి 1 శాతం వరకు లాభాల్లో ట్రేడయ్యాయి.

NSEలో బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్, ఐటీసీ, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, మారుతీ, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, దివీస్ ల్యాబ్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, ఎయిర్ టెల్, బ్రిటానియా, నెస్లే, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి నేడు టాప్ లూజర్లుగా ప్రయాణాన్ని వారాంతంలో ముగించాయి.


Click it and Unblock the Notifications