Stock Market: బోల్తా పడిన Sensex-Nifty.. ఎరుపెక్కిన స్పెషల్ ట్రేడింగ్ సెషన్..
Market Closing: ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రం ముగిసే సమయానికి నష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో పవర్, మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్ మెరుగైన పనితీరును కనబరిచాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 260 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ అయిన నిఫ్టీ 37 పాయింట్లను కోల్పోయింది. అయితే బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 407 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 270 పాయింట్ల లాభంలో ముగిశాయి. ఈ క్రమంలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, కోటక్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కొ, ఎస్బీఐ, గ్రాసిమ్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఎన్టీపీసీ, ఎయిర్ టెల్,యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, ఎల్‌టిఐఎమ్, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఈ క్రమంలో హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, దివీస్ ల్యాబ్, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఆటో, రిలయన్స్, ఐటీసీ, మారుతీ, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications